Winter Care Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే.. మీ డైట్‌లో ఇవి తప్పక ఉండాల్సిందే..!
Winter Care Tips: చలికాలంలో అవిసె గింజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. అవిసె గింజలను నేరుగా తినలేకపోతే, లడ్డూలను తయారు చేసి తీసుకోవచ్చు.
Flaxseeds Benefits: అవిసె గింజలు(Flaxseeds) ఆరోగ్య పరంగా చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. శీతాకాలంలో(Winter Care Tips), గుండె, ఆర్థరైటిస్ మొదలైన రోగులకు తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో అవిసె గింజల వినియోగం వారికి చాలా ప్రయోజనకరంగా(Flaxseeds Benefits) ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం వేడెక్కుతుంది. గుండె కొట్టుకోవడం నార్మల్‌గా ఉంటుంది. ఇతర గుండె సంబంధిత సమస్యల ప్రమాదాల నుంచి కాపాడుతుంది. ఇది కాకుండా, ఆర్థరైటిస్ రోగులకు అవిసె గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల జలుబుతోపాటు కీళ్లలో వాపు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, ఒమేగా-3 యాసిడ్స్ శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
కానీ, చాలా మంది అవిసె గింజలను నేరుగా తినలేరు. ఎందుకంటే ఇది కొద్దిగా జిగటగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు అవిసె గింజల లడ్డూలను తయారు చేసి తినవచ్చు. అవిసె గింజల లడ్డూలు రుచికరమైనవి, ప్రయోజనకరమైనవి కూడా. అవిసె గింజల లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజల లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు.. 200 గ్రాముల అవిసెలు, 100 గ్రాముల పల్లీలు, 50 గ్రాముల నువ్వులు, 175 గ్రాముల బెల్లం, 50 గ్రాముల పంచదార, పావుకప్పు కప్పు నెయ్యి, యాలకులు, బాదం, పిస్తా
ముందుగా పల్లీలు, నువ్వులు, అవిసెలని వేయించి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ముందుగా అవిసెలని పొడిలా చేసి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి. తరవాత పల్లీలు, నువ్వులను కూడా పొడిలా చేసుకోవాలి.
లడ్డూల తయారీ విధానం.. ఒక బాణలిలో బెల్లం తరుగు వేసి లో ఫ్లేమ్‌లో కరిగేవరకు కలుపుతూ ఉండాలి. అనంతరం ఈ మిశ్రమంలో పంచదార కూడా వేసి పూర్తిగా కరిగేలా చూడాలి. అనంతరం పల్లీలు, నువ్వులు, అవిసెల గింజల పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి.
అనంతరం స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారితే లడ్డూలు చేసేందుకు కష్టమవుతుంది. వేడిగా ఉన్నప్పుడే అరచేతులకు కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి. దీంతో అవిసె గింజల లడ్డూలు తయారవుతాయి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. వీటిని పాటించాలంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించి, నిర్ణయం తీసుకోండి.
Weight Loss Diet: ఆకుకూరలతో వేగంగా బరువు తగ్గొచ్చు తెలుసా..? అవేంటంటే..