Egg Boiling: కోడిగుడ్లు ఉడకబెడుతున్నారా.. పగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Egg Boiling: వంటగదిలో కొన్ని పనులు చేయాలంటే చాలా శ్రమ అవసరం. ఒక్కోసారి మహిళలు ఆ పనులు చేయలేక విసిగిపోతారు. కానీ కొన్ని చిట్కాల ద్వారా
![Egg Boiling: కోడిగుడ్లు ఉడకబెడుతున్నారా.. పగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/02/egg-boiling.jpg?w=1280)
Egg Boiling: వంటగదిలో కొన్ని పనులు చేయాలంటే చాలా శ్రమ అవసరం. ఒక్కోసారి మహిళలు ఆ పనులు చేయలేక విసిగిపోతారు. కానీ కొన్ని చిట్కాల ద్వారా అలాంటి పనులను సులభంగా చేయవచ్చు. అంతేగాక సమయం కూడా ఆదా అవుతుంది. ఉదాహరణకు మీరు కోడిగుడ్ల కూర వండాలని అనుకుంటే ముందుగా గుడ్లని ఉడకబెట్టాలి. కానీ ఒక్కోసారి అవి సరిగ్గా ఉడకవు. కొన్నిసార్లు గుడ్లు పగిలిపోయి లోపలిభాగం పైకి వస్తోంది. పెంకు తీసేటప్పుడు సరిగ్గా రాదు. ఉడకబెట్టిన గుడ్లు ఇలా కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే గుడ్లు పగలకుండా ఉడకబెట్టాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. ఇవి పాటిస్తే గుడ్లని తక్కువ సమయంలోనే మంచిగా ఉడికించవచ్చు. ముందుగా ఒక పెద్ద గిన్నెలో నీటిని తీసుకోండి. గుడ్లు మునిగేంత నీరు ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల గుడ్లు ఒకదానికొకటి ఢీకొనవు.
నీరు మరగడం ప్రారంభించిన తర్వాత అందులో నెమ్మదిగా గుడ్లు వేయండి. మంటని ఎప్పుడూ మీడియంలో ఉంచండి. ఈ నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేయండి. గుడ్లు సుమారు 15 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఇప్పుడు గుడ్లను వేడి నీటిలో నుంచి తీసి చల్లటి నీటిలో వేయాలి. సుమారు 10 నిమిషాల తరువాత వాటి పెంకులు తీయండి. గుడ్డు పగలకుండా సులభంగా వస్తుంది. గుడ్డు కూడా సూపర్‌గా ఉడుకుతుంది. ఉడకబెట్టిన గుడ్డును కొద్దిగా పగులగొట్టి చల్లటి నీటిలో వేస్తే పెంకు సులభంగా వస్తుంది. గుడ్డు పగిలిపోయి ఇంకా ఉడకబెట్టాల్సిన అవసరం ఉన్నట్లయితే ఆ నీటిలో కొద్దిగా వైట్ వెనిగర్ కలపాలి. దీని వల్ల గుడ్డులోని ద్రవం బయటకు రాకుండా ఉంటుంది.