Mint Leaves: కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలున్నాయా.. పుదీనాను ఇలా వాడండి తగ్గిపోతుంది..
పుదీనా (Mint)తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరచూ వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి (Health) ఎంతో మేలు జరుగుతుంది...
పుదీనా (Mint)తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరచూ వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి (Health) ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం (Calcium), ఫాస్ఫరస్ మూలకాలు, సీ, డీ, ఈ, బీ విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్యాన్ని దగ్గరికి రానివ్వవు. మరి ఆరోగ్యపరంగా పుదీనాతో ఎన్ని లాభాలున్నాయో చూద్దాం..
పుదీనా ఆకులను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో వికారంగా అనిపించినప్పుడు ఒక కప్పు పుదీనా టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. శ్వాస సంబంధమైన సమస్యలకు కూడా పుదీనా చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గిన్నెలో వేడినీళ్లు పోసి, దాంట్లో నాలుగైదు చుక్కల పుదీనా (Mint Oil) నూనె వేసి ఆవిరి పట్టుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
పుదీనా అలర్జీ, ఉబ్బసం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే పుదీనాను తరచూ కూరల్లో ఉపయోగించాలి. అదేవిధంగా అచ్చం పుదీనాను పచ్చడి రూపంలో కూడా తీసుకోవచ్చు. పుదీనా టీ తాగడం ద్వారా జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఇక పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పుదీనా ఆకులను తరచూ నమలడంవల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి పద్ధతులు/ఆహారం/చిట్కాలు పాటించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోవడం మంచింది.
Read Also.. Health Tips: ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే, ఈ ఆహారాలను దూరం పెట్టండి..!