Health Tips: మూత్రం ఆపుకుంటే తీవ్రమైన సమస్యలు రావొచ్చు.. రాళ్లు తయారు కావడంతో పాటు..

పరిస్థితులు, వారు ఉన్న చోటు కారణంగా చాలా మంది మూత్ర విసర్జన ఆపుకుంటారు. ముఖ్యంగా స్కూల్ వెళ్లే పిల్లలు....

Health Tips: మూత్రం ఆపుకుంటే తీవ్రమైన సమస్యలు రావొచ్చు.. రాళ్లు తయారు కావడంతో పాటు..
Urine
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 25, 2022 | 9:16 AM

పరిస్థితులు, వారు ఉన్న చోటు కారణంగా చాలా మంది మూత్ర విసర్జన ఆపుకుంటారు. ముఖ్యంగా స్కూల్ వెళ్లే పిల్లలు.. పిల్లలు మూత్రానికి వెళ్లవలసి వచ్చినా, టీచర్‌ని అడగడానికి సిగ్గుపడి అడగరు. ఒకోసారి అడిగినా, టీచర్లు పంపకపోవచ్చు.. దాంతో వాళ్లు ఆపుకోలేక చాలా ఇబ్బంది పడతారు. పెద్దవాళ్లు కూడా ఒకోసారి కొన్ని కారణాల వల్ల మూత్ర విసర్జన వాయిదా వేస్తుంటారు. అయితే అలా మూత్రం వచ్చిన వెంటనే ఆ పని కానివ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణలు చెబుతున్నారు. ఒంట్లో ఉన్న మలినాల్ని కడిగి తనతోపాటు బయటకి తీసుకెళ్లే ద్రవపదార్థమే మూత్రం. సాధారణంగా మనుషుల బ్లాడర్‌ 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల దాకా మూత్రాన్ని ఉంచుకోగలదు. ఆ పరిమితి దాటిన క్షణం నుంచే బ్లాడర్‌ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అక్కడినుంచి ఎంతసేపు మూత్రాన్ని ఆపుకుంటే అంత ఒత్తిడి. బ్లాడర్‌ పరిమాణం పెరుగుతుంది. ఇలా సైజులో మార్పులు రావడం వలన మెదడుకి బ్లాడర్‌ నుంచి సంకేతాలు తక్కువగా అందుతాయి.

మూత్ర విసర్జన జరగాల్సిన సమయంలో జరగకపోవచ్చు. ఇలా చేయడం వలన మలినాలు ఎక్కువసేపు అలానే ఉండిపోతాయి. మూత్రాన్ని అలా ఆపి ఉంచడం వలన మూత్రంలోని కొన్ని పదార్థాలు జిగటగా మారతాయి. ఇవే మెల్లిమెల్లిగా రాళ్లుగా మారతాయి. ఇదే పద్ధతి కొనసాగిస్తూ ఉంటే, అవి ఇంకా బంకగా మారి, మరింత పెద్ద రాళ్లుగా మారుతాయి. మూత్రాన్ని ఆపుకోవడం వలన కిడ్నీల్లో స్టోన్స్, ఇన్ఫెక్షన్‌ వచ్చే ఛాన్స్‌ మహిళల్లోనే ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే పురుషుల మాదిరిగా వారు ఎక్కడపడితే అక్కడ మహిళలు వాష్ రూంకు వెళ్లలేరు. దీంతో మూత్రన్ని ఆపుకుంటారు. ఈ అలవాటు వలన వచ్చే మరో సమస్య యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా ఎక్కువ. ఈ రకమైన ఇన్ఫెక్షన్‌ వచ్చిందనుకోండి, మాటిమాటికి మూత్రం వస్తుంది, మూత్రంలో మంటగా ఉంటుంది, ఒక్కోసారి బ్లాడర్‌ ఖాళీగా ఉన్నా మూత్రం వచ్చినట్లుగా అనిపిస్తుంది.

ఇది తీవ్రమైన సమస్య. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా పడుతుంది. జ్వరం, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎన్నో వస్తాయి. అందుకే ద్రవపదార్థాలను ప్లాన్డ్‌ గా తీసుకోవాలి. బస్సుల్లో దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసు మీటింగ్స్‌ ఉన్నప్పుడు నీళ్లు కొద్దిగా తక్కువ తీసుకోవడం మంచిది. అలా అని నీళ్లు తాగడం తక్కువే చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి.

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి పద్ధతులు/ఆహారం/చిట్కాలు పాటించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోవడం మంచింది.

Read Also.. Mint Leaves: క‌డుపు ఉబ్బ‌రం, వికారం వంటి స‌మ‌స్య‌లున్నాయా.. పుదీనాను ఇలా వాడండి తగ్గిపోతుంది..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!