Bheemla Nayak: భీమ్లానాయక్ సినిమాలో అడివి తల్లి పాట పాడిన దుర్గవ్వకు పారితోషకం ఎంతో తెలుసా..?

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇప్పటికే థియేటర్లు వారం రోజుల పాటు బుక్ అయ్యాయి.

Bheemla Nayak: భీమ్లానాయక్ సినిమాలో అడివి తల్లి పాట పాడిన దుర్గవ్వకు పారితోషకం ఎంతో తెలుసా..?
Durgavva
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Feb 25, 2022 | 12:49 PM

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇప్పటికే థియేటర్లు వారం రోజుల పాటు బుక్ అయ్యాయి. బుక్ మై షోలో హాట్ కేక్ లా భీమ్లానాయక్‌ టికెట్లు అమ్ముడుపోయాయి. మరోవైపు ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో భీమ్లా నాయక్ మూవీ రూపొందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. తమన్ బాణీలు కట్టారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే.

ఈ సినిమలో తమన్ సరికొత్త ప్రయోగం చేశారు. ఈ సినిమాలో కుమ్మరి దుర్గవ్వ .. సాహితీ చాగంటితో కలిసి `అడవి తల్లి మాట..` నెట్టింట ఏ స్థాయిలో వైరల్ గా మారిందో అందరికి తెలిసిందే. ఈ పాటకోసం మారు మూల గ్రామంలో ఉండే దుర్గవ్వ ను వెతికి ఈ సినిమాలో పాట పాడించారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. కూలి పనులు చేసుకుంటూ ఫోక్ సాంగ్స్ పాడే దుర్గవ్వ అడివి తల్లి పాటని పాడిన తీరు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది.  ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో దుర్గవ్వ మాట్లాడుతూ.. ఐదారు నిమిషాల్లోనే పాట పాడేశానని ఈ పాట కు రూ. 10 వేలు ఇచ్చారని మిగతా మొత్తాన్ని నా కూతురుకు అందజేశారని తెలిపింది. అయితే ఆమెకు కావలసినంత ఆర్ధిక సాయం చిత్రయూనిట్ చేసిందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Ultimate: బిగ్‏బాస్ షో హోస్ట్‏గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..

Nithya Menon: నిత్యయవ్వన మకరందం ‘నిత్యామీనన్’.. బూరె బుగ్గల చిన్నదాని నయా ఫొటోస్ అదుర్స్..

Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్​మీడియా ట్రెండింగ్​