Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మీ డైట్‌లో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే..
చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థలు తీసుకోడం వల్ల..
చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థలు తీసుకోడం వల్ల బరువు తగ్గొచ్చని(weight loss) నిపుణులు చెబుతున్నారు. అలాంటి పదార్థాల్లో కీరదోసకాయ(Cucumber) ఒకటి.. కీరదోసకాయ ఆరోగ్యానికి చక్కని ఔషధం(Medicine)గా పని చేస్తుంది. సౌందర్యానికి ప్రియనేస్తం. బరువు పెరిగినవారికి బద్ధ శత్రువు. వేసవి దాహం..తాపం తీర్చే మంచినీటి సరస్సు కీర దోసకాయ. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీన్ని తింటున్నారు. కీరదోసకాయలో కొవ్వు నిల్. కీరదోసకాయలను సలాడ్‌లలో వేసుకుని తినండి. బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రుచి కోసం కొందరు కీరదోసకు నిమ్మరసం, ఉప్పు, నల్ల మిరియాలు జోడించి తింటుంటారు. రోజుకు ఒక్క కీరదోసకాయ తినడం మంచిది.
కీరదోసలో విటమిన్స్, వాటర్ కంటెంట్, మినిరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఐరన్, క్యాల్షియంలు అధికంగా ఉన్నాయి. ఇది హానికరమైన టాక్సిన్స్‌ను బాడీ నుంచి ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కీరదోసకాయను రోజులో ఎప్పుడైనా తినవచ్చు. అలాగే కీరదోసకాయకు క్యారెట్, ఆపిల్స్, మస్క్ మెలోన్ వంటివి జోడించి సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. రోజూ కీరదోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. కీరదోసకాయ కిడ్నీని శుభ్రపరచడంలో, టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేయడంలో గ్రేట్ నేచురల్ రెమెడీ.
ఇందులో విటమిన్స్, మినిరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, బ్లాడర్ మరియు కిడ్నీ స్టోన్స్ ను కరిగించి బయటకు నెట్టేస్తుంది. ఎక్సెస్ యూరిక్ యాసిడ్ ను బాడీ నుండి తొలగిస్తుంది, దాంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది,.కీరలో ఉండే ఔషధగుణాల వల్ల బ్రెస్ట్, యుటేరియన్, ప్రొస్టేట్ వంటి వివిధ రకాల క్యాన్సర్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫాలీఫినాల్స్, ఫైటోన్యూట్రీయంట్స్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.
రోజూ నాలుగు కీరదోసముక్కలు తినడం వల్ల స్టొమక్ అల్సర్ నివారిస్తుంది. పొట్టకు చల్లదనం అందిస్తుంది,. కీరదోసలో ఉండే ఆల్కనిటి స్టొమక్ అల్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రెండు గ్లాసులు కీరదోస జ్యూస్ తాగడం వల్ల ఇది స్టొమక్ అల్సర్ నివారిస్తుంది. కీరదోసకాయలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. హైబిపి, లోబిపి రెండింటిని కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.కీరదోసకాయలో 95శాతం నీరు ఉండటం వల్ల, వేడి వాతావరణం లేదా హాట్ సమ్మర్ లో శరీరానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది. కాబట్టి రోజూ ఫ్రెష్ కీరదోసకాయను తినడం మంచిది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
Read Also.. Angiogram: అసలు యాంజియోగ్రామ్ అంటే ఏమిటి.. ఏ సమయాల్లో చేస్తారు..? ఎందుకు చేస్తారు..?