Health News: పెళ్లిళ్ల సీజన్‌లో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 ఆహారాలు బెస్ట్..

|

Nov 27, 2021 | 10:33 PM

Health News: పెళ్లిళ్ల సీజన్‌లో ప్రజలు ఆహార కోరికలను నియంత్రించుకోలేకపోతారు. అధికంగా తినడం వల్ల జీర్ణసంబంధమైన సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు.

Health News: పెళ్లిళ్ల సీజన్‌లో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 ఆహారాలు బెస్ట్..
Foods
Follow us on

Health News: పెళ్లిళ్ల సీజన్‌లో ప్రజలు ఆహార కోరికలను నియంత్రించుకోలేకపోతారు. అధికంగా తినడం వల్ల జీర్ణసంబంధమైన సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అందుకే మీ జీర్ణవ్యవస్థని ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. తద్వారా వివాహ సీజన్‌ను పూర్తిగా ఎంజాయ్‌ చేయవచ్చు. మన ముందు చాలా రకాల ఆహారాలు ఉన్నాయి వాటిని చూసిన తర్వాత మీ కోరిక పెరుగుతుంది. అతిగా తిన్న తర్వాత అది మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి సమయంలో ఈ మూడు ఆహారాల గురించి తెలుసుకోండి.

1. మెంతి లడ్డు
మెంతి గింజలు, బెల్లం, నెయ్యి, పొడి అల్లంతో తయారు చేసిన ఆరోగ్యకరమైన లడ్డు తినాలి. ఇది తిమ్మిరి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. పేగు శ్లేష్మ పొరను పెంచుతుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది. అల్పాహారం భోజనం తర్వాత సాయంత్రం 4-6 గంటలకు తీసుకోవాలని సూచించారు.

2. మజ్జిగ
భోజనం చేసిన వెంటనే హింగ్, బ్లాక్ సాల్ట్ కలిపిన ఒక గ్లాసు మజ్జిగ తాగాలి. ఈ మజ్జిగ ప్రోబయోటిక్స్, విటమిన్ B12 రెండింటికీ మంచి మూలం. హింగ్, బ్లాక్ సాల్ట్ కలయిక ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. IBSని నిరోధించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా సాయంత్రం ఈవెంట్‌లకు హాజరవుతూ చదునైన కడుపుని కోరుకుంటే ఛాస్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

3. చ్యవనప్రాష్
నిద్రవేళలో ఒక చెంచా చ్యవన్‌ప్రాష్ తింటే రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. ఇది ఫ్లేవనాయిడ్‌లు, యాంటీఆక్సిడెంట్‌ల మూలం. వివాహ వేడుకల సమయంలో చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. అర్థరాత్రి వివాహాలు రొటీన్ అయితే ప్రత్యేకంగా మీరు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను కలిగి ఉంటే చ్యవన్‌ప్రాష్‌ని తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..