AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత తిన్నా బరువు పెరగడం లేదా.. ఈ సూపర్ ఫుడ్ తింటే 30 రోజుల్లోనే అద్భుతాలు..

Weight Gain: నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో మనకు సంపాదనపై ఉన్న శ్రద్ధ ఆరోగ్యంపై ఉండటం లేదు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మితిమీరిన పని ఒత్తిడి, మానసిక ఆందోళనల వల్ల చాలామంది తెలియకుండానే శారీరకంగా బలహీనపడిపోతున్నారు. అయితే బరువు పెరగడం కోసం మందులు లేదా పౌడర్ల జోలికి వెళ్లడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తాయి.

ఎంత తిన్నా బరువు పెరగడం లేదా.. ఈ సూపర్ ఫుడ్ తింటే 30 రోజుల్లోనే అద్భుతాలు..
Dry Dates For Weight Gain
Krishna S
|

Updated on: Jan 31, 2026 | 6:50 AM

Share

నేటి ఆధునిక కాలంలో బరువు తగ్గడానికి ఎన్ని చిట్కాలు ఉన్నాయో, సరైన బరువు లేక ఇబ్బంది పడే వారి సంఖ్య కూడా అంతే ఉంది. బిజీ జీవనశైలి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి వల్ల చాలామంది తక్కువ బరువు, నీరసంతో బాధపడుతున్నారు. కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి మార్కెట్లో దొరికే కెమికల్ మందుల కంటే, మన ఆయుర్వేదంలో చెప్పబడిన సహజ పద్ధతులు ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. రసాయనిక మందుల జోలికి వెళ్లకుండా, మన ఇంట్లోనే దొరికే ఎండు ఖర్జూరాలతో ఆరోగ్యకరంగా బరువు ఎలా పెరగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు పెరగడానికి దివ్యౌషధం

ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలనుకునే వారికి ఎండిన ఖర్జూరం ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా కేలరీల సమతుల్యతను కాపాడతాయి.

పోషకాల గని

ఖర్జూరంలో కేవలం శక్తి మాత్రమే కాదు శరీరానికి అవసరమైన ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. కాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. ఐరన్ రక్తహీనతను తగ్గించి, రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫైబర్ జీర్ణక్రియను సాఫీగా ఉంచి, మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తుంది.

ఎలా తీసుకోవాలి?

కండరాల నిర్మాణానికి, ఆరోగ్యకరమైన కొవ్వును పెంచడానికి ఖర్జూరాన్ని పాలతో కలిపి తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. కొన్ని ఎండిన ఖర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ ఖర్జూరాలను తిని, ఆ పాలను తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా లోపల నుండి బలం చేకూరుతుంది. రసాయనాలతో కూడిన పౌడర్లు, మందుల జోలికి వెళ్లకుండా ఇలాంటి సహజసిద్ధమైన ఆహారంతో మీ బరువును, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎంత తిన్నా బరువు పెరగడం లేదా.. ఈ సూపర్ ఫుడ్ తింటే 30 రోజుల్లోనే..
ఎంత తిన్నా బరువు పెరగడం లేదా.. ఈ సూపర్ ఫుడ్ తింటే 30 రోజుల్లోనే..
ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని బ్రదర్స్.. అఖిల్‌ అకౌంట్‌లో బిగ్ హిట్‌
ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని బ్రదర్స్.. అఖిల్‌ అకౌంట్‌లో బిగ్ హిట్‌
భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత ?
భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత ?
సింగిల్‌గా వర్క్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు తోడుగా మినీ మోచి
సింగిల్‌గా వర్క్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు తోడుగా మినీ మోచి
ఆడియన్స్‌ డబ్బు ఖర్చు చేసేది అందుకే.. ఇబ్బంది పెట్టొదంటున్న విజయ్
ఆడియన్స్‌ డబ్బు ఖర్చు చేసేది అందుకే.. ఇబ్బంది పెట్టొదంటున్న విజయ్
2027 సంక్రాంతికి వెంకీతో మరో మల్టీస్టారర్ రెడీ చేస్తున్న అనిల్..
2027 సంక్రాంతికి వెంకీతో మరో మల్టీస్టారర్ రెడీ చేస్తున్న అనిల్..
చిరు టు బన్నీ.. పాన్‌ ఇండియా ట్రెండ్‌తో మారిన రెమ్యునరేషన్లు
చిరు టు బన్నీ.. పాన్‌ ఇండియా ట్రెండ్‌తో మారిన రెమ్యునరేషన్లు
రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్‌? 300 వందే భారత్‌ రైళ్లు..?
రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్‌? 300 వందే భారత్‌ రైళ్లు..?
ట్రోఫీ గెలవాలంటే ఆ విషయంలో బీకేర్ ఫుల్..: రోహిత్ శర్మ
ట్రోఫీ గెలవాలంటే ఆ విషయంలో బీకేర్ ఫుల్..: రోహిత్ శర్మ
Horoscope Today: వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి..
Horoscope Today: వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి..