
దేశవ్యాప్తంగా ఉన్న తేనీరు ప్రియుల దృష్టి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ టీ ఆకర్షిస్తోంది. దీని రంగు రుచి కూడా అలరిస్తుంది. గ్రీన్ టీ , డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కలయికతో పింక్ టీని తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పింక్ రంగు టీ అందంగా కనిపించడమే కాదు ఆరోగ్యకరం కూడా.. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు, డ్రాగన్ ఫ్రూట్ లోని పోషకాలు ఈ టీని ఆరోగ్య పానీయంగా చేస్తున్నాయి. ఈ పింక్ టీ కళ్ళకు మాత్రమే కాదు శరీరానికి కూడా ఒక విందు. జీర్ణక్రియకు సహాయపడుతుంది. షుగర్ పేషెంట్స్ కి ప్రయోజనం చేకూరుస్తుంది. మిల్క్ టీ కంటే ఎన్నో రెట్లు ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఐస్‌డ్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ టీ రెసిపీ గురించి ఈ రోజు తెలుసుకుందాం..
తాజా డ్రాగన్‌ఫ్రూట్- ¼ కప్పు గుజ్జు
నీరు- ½ కప్పు
గ్రీన్ టీ బ్యాగ్- 1
తాజా నిమ్మరసం- 2 టేబుల్ స్పూన్లు
తాజాడ్రాగన్ ఫ్రూట్ ముక్కలు- 2 టేబుల్ స్పూన్లు
ఐస్ క్యూబ్స్- 6
తేనె – రుచికి సరిపడా
తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో అర కప్పు నీరు పోసుకుని నీటిని మరిగించి.. ఆ నీటిని ఒక కప్పులోకి తీసుకుని ఆ వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ లో వేయండి. ఈ గ్రీన్ టీ ఉన్న నీరుని గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరచండి. తర్వాత నీటి నుంచి గ్రీన్ టీ బ్యాగ్‌ను తీసివేయండి. ఇప్పుడు ఈ గ్రీన్ టీ నీటిలో డ్రాగన్‌ఫ్రూట్ ప్యూరీ వేసి బాగా కలపండి. లేదా బ్లెండ్ చేయండి. తర్వాత ఈ నీటిని వడకట్టి.. ఆ నీటిలో డ్రాగన్‌ఫ్రూట్ ముక్కలు, నిమ్మరసం వేసి కలపండి. నచ్చిన విధంగా స్వీటెనర్ అంటే తేనెను జోడించండి. చివరగా కావాల్సినన్ని ఐస్ క్యూబ్స్ జోదించండి. అంతే చల్లచల్లగా డ్రాగన్ ఫ్రూట్ రిఫ్రెషర్ టీ రెడీ. అంతే ఈ టీని ఆస్వాదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.