మీకు సలాడ్స్‌ అంటే ఇష్టమా..? పండ్లు, కూరగాయలు కలిపి తింటే ఏమౌతుందో తెలుసుకోండి..!

|

Dec 16, 2024 | 9:30 AM

ఫ్రూట్, వెజిటబుల్ సలాడ్‌లను కలిపి తినే ముందు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు అవి ఆరోగ్యానికి కొంత హాని కలిగించే అవకాశం ఉంది. కొన్ని పండ్లు, కూరగాయలు

మీకు సలాడ్స్‌ అంటే ఇష్టమా..? పండ్లు, కూరగాయలు కలిపి తింటే ఏమౌతుందో తెలుసుకోండి..!
Salad
Follow us on

సలాడ్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరికి ఫ్రూట్ సలాడ్ అంటే ఇష్టం. మరికొందరికి వెజిటబుల్ సలాడ్ ఇష్టంగా తింటారు. కొంతమంది పండ్లు, కూరగాయలు కలిపి సలాడ్‌ రూపంలో తినడానికి ఇష్టపడతారు. అయితే, ఇలా పండ్లు, కూరగాయలు కలిపి తినటం మంచిదా.? కదా అనే విషయం తెలుసుకోవటం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. పండ్లు, కూరగాయలు కలిపి తినటం వల్ల కలిగే లాభానష్టాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

పండ్లు, కూరగాయలు.. ఈ రెండింటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, పొటాషియం, జింక్, ఐరన్ వంటి అనేక పోషకాలు శరీరానికి కవాల్సినవన్నీ సమృద్ధిగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో పండ్లు, కూరగాయల సలాడ్‌లను కలిపి తినడం ఆరోగ్యకరమైన ఎంపిక అంటున్నారు పోషకాహార నిపుణులు. తాజా పండ్లు, కూరగాయలతో సలాడ్ తింటే వాటి నుండి ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పొందడమే కాకుండా, ఇలా తీసుకోవటం వల్ల కేలరీలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఈ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ సలాడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, వీటిని తీసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కూరగాయలను ఫ్రూట్ సలాడ్స్ తో కలిపి తింటే మంచి కాంబినేషన్ ఎంచుకోవాలి. యాపిల్, క్యారెట్, ఎర్ర ముల్లంగిని సలాడ్‌గా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉన్నాయి. డయాబెటిక్, కిడ్నీ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సలాడ్ చేయడానికి ముందు, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడగటం మాత్రం మర్చిపోవద్దు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఫ్రూట్, వెజిటబుల్ సలాడ్‌లను కలిపి తినే ముందు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు అవి ఆరోగ్యానికి కొంత హాని కలిగించే అవకాశం ఉంది. కొన్ని పండ్లు, కూరగాయలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అంతే కాదు, కొన్ని పండ్లు, కూరగాయలను కలిపి సలాడ్ రూపంలో తినడం వల్ల కూడా అలర్జీ సమస్యలు వస్తాయి. వాటిని సరైన పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి