Healthy Breakfast Foods: మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..

|

Nov 14, 2023 | 7:10 AM

విటమిన్ డి కాల్షియం, ఫాస్పరస్‌ను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, విటమిన్ డి అనేది సూర్యరశ్మి నుండి పొందిన విటమిన్, చాలా మంది ప్రజలు ముఖ్యంగా శీతాకాలంలో విటమిన్ డి లోపంతో బాధపడుతుంటారు..అయితే, ఉదయం చేసే అల్పాహారంలో గుడ్లు తినడం మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Healthy Breakfast Foods: మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..
Eggs
Follow us on

Healthy Breakfast Foods: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో బలవర్ధకమైన, పోషకాలతో నిండిన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వైద్యులు కూడా పదే పదే ఇదే సూచిస్తుంటారు. మీరు తీసుకునే మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌..ఆ రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.. అందుకనే ఉదయం మీరు తీసుకునే అల్పాహారం రోజులో మీకు ముఖ్యమైన భోజనంగా చెబుతారు. రాత్రి నుండి ఉదయం వరకు అందరం నిద్రపోతాం.. కాబట్టి, ఈ సమయంలో ఏం తినకుండా, తాగకుండా ఉంటారు. అందువల్ల శరీరానికి జీవక్రియలు నిర్వహించటానికి శక్తి ఉండదు. కాబట్టి ఉదయం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేసి తీరాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నందున, ఆరోగ్యమైన అల్పాహారం తిని ఉదయం మీ దినచర్యను ప్రారంభించాలని చెబుతున్నారు. అయితే, ఉదయం చేసే అల్పాహారంలో గుడ్లు తినడం మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటికి పసుపు కలిసినప్పుడు జీర్ణ సమస్యలకి మందులా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా గుడ్లు తీసుకుని ఓ బౌల్‌లో పగలగొట్టాలి. అందులో పసుపు వేసి బాగా కలపండి. పాన్ వేడి చేసి నూనె వేయండి. అందులో ఇప్పుడు పాలకూర వేయండి. ఇప్పుడు పసుపు, గుడ్డు మిశ్రమం వేయండి. గుడ్ల మిశ్రమం ఉడికేవరకూ ఫ్రై చేసి తినేయడమే.

ఆహారంలో గుడ్లను చేర్చుకోవాలని తరచుగా సలహా ఇస్తారు. గుడ్లు ముఖ్యంగా అల్పాహారం కోసం సిఫార్సు చేయబడ్డాయి. గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వాటిలో విటమిన్ డి కూడా మంచి మొత్తంలో ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ గా గుడ్డు తింటే.. రోజంతా శరీరం శక్తివంతంగా ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా దారితీస్తుంది. గుడ్లు అధిక ప్రొటీన్లను కలిగి ఉంటుంది. వీటిని తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. శరీరం స్వయంగా ఉత్పత్తి చేయలేని అనేక అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు అల్పాహారంగా గుడ్లు తింటే మీకు పదేపదే ఆకలి వేయదు. ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది. బరువు తగ్గడం ప్రభావం త్వరలోనే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

దృష్టి పెరుగుతుంది..

గుడ్లలో లుటిన్, జియాక్సంతిన్ ఉన్నాయి. ఇవి వృద్ధాప్య కళ్ళకు ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి. క్యారెట్‌లాగే గుడ్లు కూడా కంటికి మేలు చేస్తాయి.

ఆరోగ్యకరమైన జుట్టు..

జుట్టుకు అంతర్గతంగా పోషణ ఉంటే, బాహ్యంగా జుట్టు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్లు , ఖనిజాలు, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. మీ భోజనంలో రోజూ గుడ్లను చేర్చుకుంటే మీ జుట్టుకు కూడా మంచిది. అవి జుట్టు ఆకృతిని మెరుగుపరచడంలో గుడ్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఎముకలు దృఢంగా మారుతాయి..

విటమిన్ డి పుష్కలంగా ఉన్న గుడ్లు ఎముకలకు చాలా మేలు చేస్తాయి. విటమిన్ డి కాల్షియం, ఫాస్పరస్‌ను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, విటమిన్ డి అనేది సూర్యరశ్మి నుండి పొందిన విటమిన్, చాలా మంది ప్రజలు ముఖ్యంగా శీతాకాలంలో విటమిన్ డి లోపంతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, గుడ్లను ఆహారంలో భాగం చేయడం ద్వారా విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..