
డయాబెటిక్ పేషెంట్లు తాము ఎలాంటి ఆహారం తినాలి.. ఏది తినకూడదో తెలియని అయోమయానికి గురవుతారు. ఏ మాత్రం అశ్రద్ధగా వహించినా కూడా రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. మనం రోజూ తీసుకునే అనేక ఆహార పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవని, వాటి వినియోగం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
1. గుడ్లు:
గుడ్డు ఒక సూపర్‌ఫుడ్ అని చెప్పాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మధుమేహ రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులతో తరచూ గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి వారికి గుడ్లు మేలు చేస్తుంది.
2. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్:
పచ్చి ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికి తెలిసిందే. అందుకే పాలకూర, బచ్చలికూర వంటి ఆకు కూరలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి, మినరల్స్ ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది.
3. వెల్లుల్లి:
వెల్లుల్లి లేకుండా ఏ వంటకం పూర్తి కాదనే చెప్పాలి. ఇది విటమిన్ సి, విటమిన్ B6 లో సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
4. బెర్రీలు:
బ్లాక్‌బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉండే అనేక పదార్ధాలను కలిగి ఉంటాయి. వాటిలో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అవి తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. కాబట్టి అవి మీ రక్తంలో చక్కెరను పెంచవు.
5. బీన్స్:
బీన్స్ ప్రోటీన్, ఫైబర్ గొప్ప మూలంగా పరిగణించబడుతుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా పెరగదు. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..