
Chia Seeds Benefits: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక రకాల పోషకాలు అవసరం. ఇందుకోసం ఆహారంలో అనేక పదార్థాలను చేర్చాలి. అందులో ఒకటి చియా విత్తనాలు. ఇవి చాలా చిన్నగా నలుపు, తెలుపు రంగులో ఉంటాయి. ఇవి సాల్వియా హిస్పానికా మొక్క విత్తనాలు. వీటిలో అనేక రకాల ఫైబర్, ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ 5 ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.
1. చియా గింజలలో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. శరీరంలో ప్రొటీన్ లోపాన్ని అధిగమించాలంటే కచ్చితంగా వీటిని డైట్‌లో చేర్చుకోవాలి.
2. ఎముకలకు కాల్షియం చాలా అవసరం. చియా విత్తనాలలో ఇది సమృద్ధిగా లభిస్తుంది. పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
3. వయస్సుతో పాటు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో చియా విత్తనాల వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
4. చియా విత్తనాలు ఫైబర్‌కి మంచి మూలం. ఈ విత్తనాలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా చేస్తుంది.
5. బరువు తగ్గాలనుకునే వారికి చియా గింజలు చక్కటి ఎంపిక. వీటిని తినడం ద్వారా పొట్ట ఎక్కువసేపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా ఎక్కువగా ఆహారం జోలికి వెళ్లం. దీంతో బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.
6. బలహీనంగా ఉన్న వ్యక్తులు చియా గింజలు తీసుకోవడం వల్ల ధృడంగా తయారవుతారు. ఇది కాకుండా చియా గింజలు చర్మం, జుట్టు సమస్యలకు కూడా మంచిదని చెబుతారు.
7. గుర్తుంచుకోండి
చియా విత్తనాలలో చాలా పోషకాలు ఉన్నప్పటికీ నిపుణుల సలహాతో మాత్రమే దీనిని మీ డైట్‌లో చేర్చాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కొంతమందికి కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు అలర్జీలు విరేచనాలు, వాంతులకు కారణం కావొచ్చు. ఇది కాకుండా చియా విత్తనాలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి కాబట్టి డయాబెటిక్ రోగులు తినవద్దు.