Lifestyle: ఛపాతి వర్సెస్ అన్నం.. మంచి నిద్రకోసం ఢిన్నర్‌లో ఏది తినడం బెస్ట్!
రాత్రి భోజనం సమయంలో అన్నం తినాలా? లేదా చపాతీలు తినాలి అనే సందేహం చాలా మందితో ఉంటుంది. కొందరు అన్నం తినడం బెస్ట్ అంటే మరికొందరు చపాతి బెస్ట్ అంటారు. ఇంతుకు రెండింటిలో ఏది తినడం ఉత్తమం, దేన్నిటే మంచి నిద్రను పొందగలమో అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం.

రాత్రి భోజనం సమయంలో అన్నం తినాలా? లేదా చపాతీలు తినాలి అనే సందేహం చాలా మందితో ఉంటుంది. అయితే ఈ రెండూ భారతీయ ఆహారంలో ప్రధానమైన ఆహారాలు. కానీ అవి జీర్ణక్రియ, నిద్ర నాణ్యతను భిన్నంగా ప్రభావితం చేస్తాయి. నిద్రను నియంత్రించడంలో కార్బోహైడ్రేట్లు ప్రత్యక్ష పాత్ర పోషిస్తాయి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ హార్మోన్లు శరీరం విశ్రాంతి తీసుకోవడానికి, బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి. అయితే ఇక్కడ మనకు కార్బోహైడ్రేట్ రకం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణ కార్బోహైడ్రేట్లు (తెల్ల బియ్యం వంటివి) త్వరగా జీర్ణమవుతాయి, అయితే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు (హోల్ వీట్ బ్రెడ్ వంటివి) శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి.
ఛపాతి వర్సెస్ అన్నం
రాత్రి భోజనం: మీకు రాత్రి భోజనం త్వరగా జీర్ణం కావాలనుకుంటే రైస్‌ను తీసుకోండి. ఇది కడుపుకు తేలికగా ఉంటుంది. అలాగే త్వరగా జీర్ణం అవుతుంది. అందుకే చాలా మంది దీనిని రాత్రి భోజనంలో ఇష్టపడతారు. అధ్యయనాల ప్రకారం, బియ్యం వంటి అధిక గ్లైసెమిక్ ఆహారాలు మెదడులో ట్రిప్టోఫాన్‌ను వేగంగా విడుదల చేయడం ద్వారా మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడతాయి.
రాత్రి చపాతీ: గోధుమ చపాతీలలో ఫైబర్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అవి శక్తిని నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గులు నివారిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు లేదా మధుమేహ వ్యాధిగ్రస్తులకు వీటిని తీసుకోవడం ఉత్తమం. అలాగే, చపాతీ జీర్ణం కావడానికి అన్నం కంటే ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి రాత్రిపూట ఎక్కువ మొత్తంలో తినడం వల్ల బరువుగా లేదా ఉబ్బరం అనిపించవచ్చు.
మంచి నిద్రకు ఏది మంచిది?
మీరు రాత్రి భోజనంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారం కావాలనుకున్న, పడుకునే ముందు మీ శరీరాన్ని ఓవర్‌లోడ్ చేయకూడదనుకున్నా, అన్నం తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది త్వరగా జీర్ణమై మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలా కాదని మీకు చాలా సమయం కడుపు నిండినట్లు ఉండానుకున్నా, రక్తంలో చక్కెర సమతుల్యతను మెరుగుపరుచుకోవాలనుకుంటే మీరు చపాతీ తినడం బెస్ట్. చివరగా, మితంగా తినడం చాలా ముఖ్యం. అన్నం, చపాతీ రెండూ సరైన పరిమాణంలో తీసుకుంటే, మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి.
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




