AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తింటే ఏమవుతుంది..? మస్ట్‌గా తెలుసుకోండి

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదనే అభిప్రాయం చాలామందిలో ఉన్నప్పటికీ, ఆరోగ్య నిపుణులు మాత్రం భిన్నంగా చెబుతున్నారు. ఇంట్లో పరిశుభ్రంగా, తక్కువ మసాలాలతో బాగా ఉడికించిన చికెన్‌ను జ్వరంలో కూడా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. చికెన్‌లో ఉండే ప్రోటీన్లు, ఇతర పోషకాలు శరీరానికి శక్తినిచ్చి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Chicken: జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తింటే ఏమవుతుంది..? మస్ట్‌గా తెలుసుకోండి
Chicken during fever
Shaik Madar Saheb
|

Updated on: Jun 23, 2026 | 2:00 PM

Share

జ్వరంతో ఉన్నప్పుడు ఆహారం విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉంటాయి. ముఖ్యంగా నాన్-వెజ్ ఆహారాలకు, జీర్ణం కాని వాటికి దూరంగా ఉండాలని చాలామంది భావిస్తారు. ఈ క్రమంలోనే చికెన్ తినాలనిపించినా కూడా మానేస్తారు. ఇంట్లో పెద్దలు కూడా దీనికి అంగీకరించరు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లో సరిగ్గా వండిన చికెన్‌ను జ్వరంలో ఉన్నప్పుడు కూడా తినవచ్చు.. అవును.. జ్వరంలో కూడా చికెన్ తినవచ్చు.. కానీ.. కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని.. లేకపోతే ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

జ్వరంలో చికెన్ ఎందుకు తినకూడదని అంటారు?

సాధారణంగా, చికెన్ ఒక మందమైన ఆహారంగా పరిగణించబడుతుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జ్వరంలో ఉన్నప్పుడు జీర్ణక్రియ నెమ్మదిగా పని చేస్తుంది కాబట్టి, చికెన్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయని చాలామంది భయపడతారు. అందుకే, చాలామంది జ్వరం వచ్చినప్పుడు నాన్-వెజ్ జోలికి అస్సలు పోకుండా, కేవలం మితమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు.

ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?

జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది? అనే సందేహాలపై ఆరోగ్య నిపుణులు స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. జ్వరంలో మీకు చికెన్ తినాలనిపించినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా తినవచ్చని వారు చెబుతున్నారు. దీనివల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది. చికెన్‌లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి జ్వరం ద్వారా వచ్చే నీరసాన్ని, అలసటను దూరం చేసి, శరీరాన్ని తిరిగి శక్తివంతంగా మారుస్తాయి.

కొంతమందికి జ్వరంలో ఉన్నప్పుడు స్పైసీ ఆహారాలు తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంట్లోనే చేసిన చికెన్ బిర్యానీ లేదా ఇతర చికెన్ ఐటమ్స్‌ను హ్యాపీగా తినవచ్చు. అయితే, ఇక్కడ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.

జ్వరంలో చికెన్ తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఇంట్లో వండిన చికెన్: బయట ఎలా వండుతారో, ఎలాంటి పదార్థాలు కలుపుతారో తెలియదు కాబట్టి, బయట చికెన్ తినడం మానుకోవాలి. ఇంట్లో పరిశుభ్రంగా, జాగ్రత్తగా వండిన చికెన్ మాత్రమే తినాలి.

మసాలాలు, కారాలు తగ్గించాలి: జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి, కారాలు, మసాలాలు, నూనెలు తగ్గించి తేలికపాటి పద్ధతిలో వండాలి.

బాగా ఉడికించాలి: చికెన్‌ను బాగా ఉడికించి తినాలి. పచ్చిగా ఉండే భాగాలు ఉండకుండా చూసుకోవాలి. బాగా ఉడికించిన చికెన్ త్వరగా జీర్ణం అవుతుంది. ఎలాంటి సమస్యలు రావు.

వేపుళ్లకు దూరంగా ఉండాలి: చికెన్ వేపుళ్లు, ఫ్రైడ్ ఐటమ్స్ మానుకోవాలి. నూనెలో వేయించినవి జీర్ణం కావడానికి మరింత కష్టమవుతాయి. ఉడికించిన లేదా కూర రూపంలో తీసుకుంటే మంచిది. నాటుకోడి పులుసు వంటివి జలుబు తగ్గడానికి కూడా సహాయపడతాయని చాలామంది విశ్వసిస్తారు.

చివరగా, జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తినడం అనేది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, సరైన పద్ధతిలో, సరైన జాగ్రత్తలతో తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది అపోహలను తొలగించి, త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

అయితే.. ఏమైనా సందేహాలున్నా.. అనారోగ్య సమస్యలున్నా నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us