Snake Gourd-Egg: పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషం అవుతుందా? ఇదిగో క్లారిటీ
మన పెద్దవాళ్లు ఏవి బడితే అవి తిననివ్వరు. పొట్ల కాయ, కోడి గుడ్డును కలిపి తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని అంటుంటారు. ఒకటి త్వరగా జీర్ణమై, మరొకటి జీర్ణం అవడానికి ఎక్కువ సమయం పడితే ఇబ్బందులు తప్పవు. ఫలితంగా జీర్ణ సమస్యలు, వాంతులతోపాటు మరిన్ని సమస్యలు మొదలవుతాయి.

ఆహారం విషయంలో ఏవి పడితే అవి తినకూడదని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఒకేసారి కొన్ని ఆహార పదార్థాలు కలిపి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటుంటారు. దీంతో ఏదైనా రెస్టారెంట్ లేదా ఫంక్షన్స్‌కి వెళ్లినప్పుడు అక్కడు ఫుడ్స్ అన్ని టేస్ట్ చేద్దామంటే.. కన్‌ప్యూజన్‌గా ఉంటుంది. ఒక పక్క నోరు లాగుతూ ఉంటుంది.. మరోపక్క ఏదైనా అవుతుందేమో అని మనసులో భయం ఉంటుంది. ముఖ్యంగా పొట్లకాయ, గుడ్డు కలిపి వండకూడదు, తినకూడదు అని మన అమ్మమ్మలు, బామ్మలు చెబుతుంటారు. ఆ రెండూ కలిపి వండి.. తింటే విషం అవుతుందని అంటుంటారు. ఇలా పాయిజన్ అవుతుందన్నది నిజమో కాదు తెలీదు కానీ ఎందుకైనా మంచిది అని చాలా మంది ఆ రెండింటి వంటకం జోలికి ఎవరూ వెళ్లరు. ఆ రోజు గుడ్డు కూర తింటే, పొట్లకాయ అవౌడ్ చేస్తారు. ఈ విషయంపై పూర్తి స్పష్టత తెచ్చుకుందాం పదండి..
పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుంది అంటుంటారు కానీ.. అది పూర్తి నిజం కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే.. ఇలాంటి కాంబినేషన్ వంటకం తింటే ప్రాబ్లమ్ ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఈ కాంబోకు దూరంగా ఉండటమే మేలు. ఏదైనా ఆహార పదార్థాలను కలిపి వండుతున్నప్పుడు.. అవి రెండు ఒకే సమయంలో డైజెస్ట్ అయితే ఎలాంటి సమస్య ఉండదు. పొట్లకాయలో నీటి శాతం చాలా ఎక్కువ కాబట్టి ఇది వెంటనే జీర్ణం అవుతుంది. కానీ కోడిగుడ్డులో చాలారకాల ప్రొటీన్స్, పోషకాలు, మాంసకృతులు, కొవ్వు వంటివి ఉంటాయి. దీంతో గుడ్డు జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. ఇటువంటి ఈ రెండూ కలిసి తింటే జీర్ణ వ్యవస్థలో పలు యాసిడ్లు రిలీజై గ్యాస్ట్రిక్ ట్రబుల్ తదితర సమస్యలు వస్తాయి. కొందరికి కడుపులో మంట కూడా ఉంటుంది. ఈ సమస్య అందరికీ వస్తుందని చెప్పడానికి లేదు. జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నవారికి ఎలా తిన్నా కూడా ప్రాబ్లమ్ ఉండదు.
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం నిపుణుల నుంచి సేకరించినది. ఇటువంటి ఆహారం అనుసరించే ముందు డాక్టర్లను, డైటీషియన్లను సంప్రదించండి. )




