Boiled Lemon: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో నిమ్మరసం ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నిమ్మరసాన్ని అనేక పదార్థాలతో కలుపుకొని తీసుకోవచ్చు. అయితే ఈ రోజు ఉడికించిన నిమ్మరసం ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం. ఈ పానీయం సిద్ధం చేయడానికి చల్లని నీటికి బదులు వేడి నీటిని ఉపయోగిస్తారు.
1. పోషకాలు
సాధారణంగా నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అదనంగా సిట్రిక్ పండులో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శక్తివంతమైన వ్యాధి-పోరాట లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పానీయంలో కొవ్వు, పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉంటుంది. కానీ పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి సహా అనేక విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. ప్రతి గ్లాసు నిమ్మరసం పోషక విలువ దానికి కలిపిన ఇతర ఆహార పదార్ధాలపై ఆధారపడి ఉంటుంది.
2. చర్మ పరిస్థితిని మెరుగు
విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. నిమ్మ నీరు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఇది వృద్ధాప్య సంకేతాలను, మొటిమలను తగ్గిస్తుంది. విటమిన్ సి తీసుకోవడం వల్ల గాయాలు వేగంగా తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కాంతివంతంగా కనిపిస్తుంది.
3. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది
నిమ్మకాయ పానీయాలు రక్తపోటును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారిలో కాల్షియం, పొటాషియం రెండూ రక్తపోటును తగ్గిస్తాయి.
4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రతిరోజూ ఈ పానీయం తాగడం వల్ల COVID, ఫ్లూ వంటి శ్వాసకోశ రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు. మీ ఆరోగ్యాన్ని ఫిట్‌గా చేయడంలో సహాయపడుతుంది.
5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మీరు తరచుగా మలబద్ధకం, ఉబ్బరం లేదా గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడితే భోజనం తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం తాగితే చాలు. ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడవచ్చు.
6. దీన్ని ఎలా సిద్ధం చేయాలి?
నిమ్మకాయను సగానికి కోసి బాగా పిండి రసం తీయాలి. ఒక గ్లాసు మరిగే నీటిలో కలపాలి. చల్లారిని తర్వాత తాగాలి. మరొక విధానంలో నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసి, గ్లాస్ వేడి నీటిలో ఉంచాలి. చల్లారిన తర్వాత తాగాలి.