Diabetic Tea Options: మీకు డయాబెటిస్ ఉందా..? రోజుకు రెండుసార్లు ఇలాంటి టీ తాగండి చాలు..!

|

Apr 11, 2024 | 7:36 AM

మధుమేహులు ఇలాంటి టీ తాగుతున్నప్పుడు దానికి చక్కెర, లేదా తేనె కలుపుకోవడం మంచిదికాదు. రుచి కోసం కావాలంటే మీరు దాల్చినచెక్క పొడి లేదా ఏలకుల పొడి వేసుకుని తాగొచ్చు. మరీ ముఖ్యంగా ఇలాంటి ఇంటి చిట్కాలు, ఆయుర్వేద మందులు వాడే ముందు..మీరు మీ వైద్యుడిని సంప్రదించండి. దీనితో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, వైద్యుల సలహాలను అనుసరించడం చాలా ముఖ్యం.

Diabetic Tea Options: మీకు డయాబెటిస్ ఉందా..? రోజుకు రెండుసార్లు ఇలాంటి టీ తాగండి చాలు..!
Diabetic Tea
Follow us on

పాలు, చక్కెర కలిపి తయారు చేసిన టీ తాగటం మానేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. కానీ, డయాబెటిక్ పేషెంట్లు టీ ఎలా తాగాలో ప్రత్యేకించి చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ డైట్‌ విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. షుగర్ లెవల్స్ మెయింటెయిన్ చేయడం తప్పనిసరి అంటున్నారు. షుగర్‌ బాధితులు దూరంగా ఉండాల్సిన ఆహారాల్లో టీ కూడా ఒకటి. ఇందులో పాలు, పంచదార ఉన్నందున దీనిని నివారించడం మంచిదని చెబుతున్నారు.. కానీ, డయాబెటిక్ పేషెంట్లు ఎలాంటి టీ తాగితే మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

1. గ్రీన్ టీ

మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఆరోగ్యకరమైన టీలలో గ్రీన్ టీ ఒకటి. గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాదు, గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

2. దాల్చిన చెక్క టీ

దాల్చిన చెక్క టీ మధుమేహాన్ని నియంత్రించడంలో ఉత్తమమైనది. దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క టీ చేయడానికి, ఒక కప్పు నీటిలో దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత టీకి బదులుగా తాగేయాలి.

3. మెంతి టీ

డయాబెటిక్ బాధితులకు మెంతి టీ మరొక గొప్ప ఎంపిక. మెంతులలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. మెంతి టీ చేయడానికి, ఒక కప్పు వేడి నీటిలో ఒక చెంచా మెంతులు వేసి 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టి తాగేయండి. రుచి కోసం కావాలంటే మీరు నిమ్మరసం కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

4. వాముతో తయారు చేసిన టీ

వాము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వాము టీ తయారు చేయడానికి ఒక గ్లాస్‌ నీటిలో పావు చెంచా వాము వేసి 5 నిమిషాలు మరిగించండి. కాస్త ఆ తర్వాత వడకట్టి తాగాలి.

5. తులసి టీ

తులసి టీలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. తులసి ఆకులు హైపోగ్లైసీమిక్ ప్రభావాలను కలిగి ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీని కోసం, ఒక కప్పు వేడి నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రుచి కోసం కొంచెం తేనె కలుపుకుని తాగేయొచ్చు.

చివరగా, మధుమేహులు ఇలాంటి టీ తాగుతున్నప్పుడు దానికి చక్కెర, లేదా తేనె కలుపుకోవడం మంచిదికాదు. రుచి కోసం కావాలంటే మీరు దాల్చినచెక్క పొడి లేదా ఏలకుల పొడి వేసుకుని తాగొచ్చు. మరీ ముఖ్యంగా ఇలాంటి ఇంటి చిట్కాలు, ఆయుర్వేద మందులు వాడే ముందు..మీరు మీ వైద్యుడిని సంప్రదించండి. దీనితో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, వైద్యుల సలహాలను అనుసరించడం చాలా ముఖ్యం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…