AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధుమేహులు మఖానా తినొచ్చా..? శరీరంలో జరిగేది ఇదే..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఈ వ్యాధికి చికిత్స లేదు. దీనిని నియంత్రణలో ఉంచుకోవడమే మార్గం. అయితే, ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదని నిపుణులు పదే పదే చెబుతుంటారు. అయితే, మధుమేహంతో మందులు తింటున్నవారు మఖానా తినొచ్చా..? తింటే శరీరంలో జరిగే మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మధుమేహులు మఖానా తినొచ్చా..? శరీరంలో జరిగేది ఇదే..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Makhana
Jyothi Gadda
|

Updated on: Jul 28, 2025 | 3:32 PM

Share

మధుమేహం.. దీనిన డయాబెటిస్‌, చక్కెర వ్యాధి అని కూడా అంటారు. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా నేడు పిల్లల నుంచి పెద్దల దాకా ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు. దీనిని నియంత్రణలో ఉంచుకోవడమే మార్గం. అయితే, ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదని నిపుణులు పదే పదే చెబుతుంటారు. అయితే, మధుమేహంతో మందులు తింటున్నవారు మఖానా తినొచ్చా..? తింటే శరీరంలో జరిగే మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మఖానా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచవు. మఖానాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మధుమేహానికి మంచివిగా పరిగణించబడతాయి. మఖానాలో యాంటీ డయాబెటిక్ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ, తగ్గుతూ ఉంటే, మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో మఖానాను చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి లైట్ స్నాక్‌గా కూడా మఖానాను తినవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, వీటిని నూనెలో వేయించకుండా పొడి వేపడం మంచిది. ఉప్పు లేకుండా తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. అలాగే, రోజుకు కొద్దిగా మాత్రమే తినాలని చెబుతున్నారు. డాక్టర్ సలహాతో మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం మీద మఖానా మధుమేహులకు సరైన ఆహారంగా చెప్పొచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..