AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ప్రతిరోజూ నీటిలో నానబెట్టిన ఖర్జురాలను తింటే స్త్రీలు, పురుషులకు ఓ వరం..! అన్ని సమస్యలకు చెక్..

ఖర్జూరంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, మాంగనీస్, జింక్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. నానబెట్టిన ఖర్జూరాన్ని తినడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. మీరు ఖర్జూరాల రుచిని ఆస్వాదించాలనుకుంటే, వాటి నుండి పోషకాలను కూడా పొందాలనుకుంటే ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తినాలి.. ఇలా తినడం వల్ల ..

Health Tips: ప్రతిరోజూ నీటిలో నానబెట్టిన ఖర్జురాలను తింటే స్త్రీలు, పురుషులకు ఓ వరం..! అన్ని సమస్యలకు చెక్..
Soaked Dates
Jyothi Gadda
|

Updated on: Oct 14, 2023 | 6:57 AM

Share

ఈ ఆధునిక, అనారోగ్యకర జీవనశైలిలో మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం ఒక పెద్ద సవాలు. కానీ ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. కొందరు వ్యక్తులు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒకవిధంగా ప్రయత్నిస్తుంటారు. ఈ రోజు మనం ఖర్జూరం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం నుంచి రక్తహీనత వరకు శరీరంలోని చిన్న, పెద్ద వ్యాధులన్నీ దూరమవుతాయి. డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరం సహజ తీపిని కలిగి ఉంటుంది. కాబట్టి మీరు చక్కెరను మానేయాలనుకుంటే.. బదులుగా ఖర్జూరాలను ఉపయోగించవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును తినడం వల్ల అనేక వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. రెండు-మూడు ఖర్జూరాలను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. మధ్యాహ్నం స్నాక్‌గా కూడా తింటే మంచిది. లంచ్‌, డిన్నర్‌ తర్వాత ఏదైనా స్వీట్‌ తినాలనే కోరికలను వదిలించుకోవటానికి ఖర్జూరం ఒక గొప్ప ఎంపిక.

నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఖర్జూరాలను నీటిలో నానబెట్టడం వల్ల అందులో ఉండే టానిన్ లేదా ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. ఇలా చేస్తే.. ఖర్జూరంలోని పోషకాలను సులభంగా గ్రహించడం శరీరానికి సహాయపడుతుంది. నానబెట్టిన ఖర్జూరాన్ని తినడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. మీరు ఖర్జూరాల రుచిని ఆస్వాదించాలనుకుంటే, వాటి నుండి పోషకాలను కూడా పొందాలనుకుంటే, వాటిని తినడానికి ముందు రాత్రి 8-10 గంటలు నానబెట్టండి. ఖర్జూరంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, మాంగనీస్, జింక్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. ఖర్జూరం తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం?

ఇవి కూడా చదవండి

1. రోజూ ఖర్జూరం తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.

2. పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

3. రక్తపోటు అదుపులో ఉంటుంది.

4. ఎముకలు దృఢంగా ఉంటాయి.

5. మెదడు పనితీరు వేగవంతం అవుతుంది.

6. అలసట మరియు బలహీనత నుండి ఉపశమనం పొందుతారు.

7. రక్తహీనత రోగులకు మేలు చేస్తుంది.

8. పైల్స్ సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది.

9. చర్మం మరియు జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

10. శారీరక బలం మరియు సత్తువను పెంచడంలో సహాయపడుతుంది.

11. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

12. పురుషులు మరియు మహిళలు ఇద్దరిలో లైంగిక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మంచిది.