AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరంలో వరుస విషాద ఘటనలు.. ఆర్థిక సమస్యలతో ఇద్దరి కూతుర్లతో సహా తండ్రి ఆత్మహత్య

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు బోయిన్ పల్లి సీఐ లక్ష్మీ నారాయణ.. అయితే, దంపతుల మధ్య ఎప్పుడూ గొడవలు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. తమ మధ్య ఎలాంటి తగాదాలు లేవని భార్య అక్షయ కన్నీరు మున్నీరుగా విలపించారు. రాత్రి భోజనాల తర్వాత అందరం ఒకే చోట నిద్రించామని, ఉదయం లేచి చూసేసరికి ఇలా జరిగిందని వాపోయారు.

నగరంలో వరుస విషాద ఘటనలు..  ఆర్థిక సమస్యలతో ఇద్దరి కూతుర్లతో సహా తండ్రి ఆత్మహత్య
Suicide
Peddaprolu Jyothi
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 13, 2023 | 7:16 PM

Share

హైదరాబాద్, అక్టోబర్13; సిటీలో ఒకే రోజు రెండు ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపాయి. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడగా, మరో మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యామిలీ గొడవలు, ఆర్థిక కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.. అభం శుభం తెలియని చిన్నారులు చనిపోవడంతో స్థానిక బస్తీల్లో విషాదం నెలకొంది..

నగరంలో ఒకే రోజు రెండు ఫ్యామిలీ సూసైడ్ ఘటనలు విషాదం నింపాయి. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భవానీ నగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ చారి అనే వ్యక్తి ఇద్దరు కుమార్తెలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది. బోయిన్పల్లికి చెందిన శ్రీకాంత్ చారికి భూదాన్ పోచంపల్లికి చెందిన అక్షయకు 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. శ్రీకాంత్ సిల్వర్ షాప్ లో పని చేస్తుండగా, వీరికి స్రవంతి, శ్రావ్య అనే ఇద్దరు పిల్లలున్నారు. రోజూ మాదరిగానే కుటుంబ సభ్యులంతా గురువారం రాత్రి భోజనం చేసి.. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ కి వెళ్లి పడుకున్నారు.. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీకాంత్ నిద్రలో ఉన్న ఇద్దరు పిల్లలకు సెనైడ్ తాగించాడు.. అనంతరం తాను సెనైడ్ తాగి చనిపోయాడు..స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించి, వీరు సైనైడ్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతుని భార్య అక్షయను ప్రశ్నించి.. వివరాలు తెలుసుకున్నారు.. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీస్ ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు బోయిన్ పల్లి సీఐ లక్ష్మీ నారాయణ.. అయితే, దంపతుల మధ్య ఎప్పుడూ గొడవలు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. తమ మధ్య ఎలాంటి తగాదాలు లేవని భార్య అక్షయ కన్నీరు మున్నీరుగా విలపించారు. రాత్రి భోజనాల తర్వాత అందరం ఒకే చోట నిద్రించామని, ఉదయం లేచి చూసేసరికి ఇలా జరిగిందని వాపోయారు. కొడుకు, మనవరాళ్ల చనిపోవడానికి కారణాలు తమకు తెలియడం లేదని తల్లి జయమ్మ విలపిస్తోంది. తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని పేర్కొన్నారు.

అటు బోరబండలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి రాజ్ నగర్ లో జ్యోతి అనే మహిళ తన ఇద్దరు కొడుకులకు విషమిచ్చి.. అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొడుకులు అర్జున్, ఆదిత్య లకు విషమిచ్చి చంపింది. తన ఇద్దరు కొడుకులకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటంతోనే తను ఇలా చేసిందని స్థానికులు తెలిపారు.. పిల్లల అనారోగ్యంతో జ్యోతి డిప్రెషన్ లోకి వెళ్లిందన్నారు.. జ్యోతి బంజారాహిల్స్, ఎన్బీటి నగర్ లో గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తుండగా, ఆమె భర్త విజయ్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఏరియాల్లో చిన్న పిల్లలు చనిపోవడంతో స్థానిక బస్తీల్లో విషాదం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..