AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donne Biryani: సంక్రాంతి స్పెషల్: ఘుమఘుమలాడే ‘చికెన్ దొన్నె బిర్యానీ’! తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపించే పక్కా నాటు రుచి!

బెంగళూరు వెళ్లినా లేదా కర్ణాటకలోని మిలిటరీ హోటళ్లకు వెళ్లినా అక్కడ అందరూ లొట్టలేసుకుంటూ తినేది దొన్నె బిర్యానీ. ఎండిన తాటి ఆకులతో చేసిన గిన్నెల్లో వడ్డించే ఈ బిర్యానీ సువాసన ఊరంతా వ్యాపిస్తుంది. దీని రుచికి ప్రధాన కారణం ఇందులో వాడే ప్రత్యేకమైన సిరగ సాంబా బియ్యం పచ్చని మసాలా దినుసులు. ఇప్పుడు అదే హోటల్ స్టైల్ రుచిని మీ వంటింట్లో కూడా సిద్ధం చేసుకోవచ్చు. వెన్నలా కరిగిపోయే ముక్కలు, నోరూరించే మసాలాతో ఉండే ఈ నాటి స్టైల్ బిర్యానీ తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Donne Biryani: సంక్రాంతి స్పెషల్: ఘుమఘుమలాడే 'చికెన్ దొన్నె బిర్యానీ'! తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపించే పక్కా నాటు రుచి!
Donne Biryani Recipe
Bhavani
|

Updated on: Jan 09, 2026 | 7:11 PM

Share

బిర్యానీ అంటే కేవలం బాస్మతీ బియ్యమే కాదు.. దక్షిణ భారతదేశంలో సిరగ సాంబా బియ్యంతో చేసే దొన్నె బిర్యానీకి విపరీతమైన క్రేజ్ ఉంది. చిన్నగా ఉండి, అద్భుతమైన సువాసననిచ్చే ఈ బియ్యం ఈ వంటకానికి ప్రాణం పోస్తాయి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరలతో తయారు చేసిన ప్రత్యేక మసాలా పేస్ట్ ఈ బిర్యానీకి ఒక విభిన్నమైన రంగును, రుచిని ఇస్తుంది. పండగ పూట ఇంట్లోనే స్పెషల్ బిర్యానీ చేయాలనుకునే వారి కోసం దొన్నె బిర్యానీ రెసిపీ స్టెప్-బై-స్టెప్ మీకోసం.

కావలసిన పదార్థాలు:

చికెన్ మ్యారినేషన్: 1 కిలో చికెన్

పెరుగు (1/4 కప్పు)

పసుపు, ఉప్పు.

మసాలా పేస్ట్: పుదీనా

కొత్తిమీర

పచ్చిమిర్చి (6)

అల్లం, వెల్లుల్లి

కరివేపాకు

కసూరి మేథి.

ముఖ్యమైనవి: సిరగ సాంబా బియ్యం (2 కప్పులు), నెయ్యి నూనె, బిర్యానీ సుగంధ ద్రవ్యాలు (లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గు), ఉల్లిపాయలు.

తయారీ విధానం:

మ్యారినేషన్: చికెన్‌ను పెరుగు, పసుపు, ఉప్పుతో కలిపి కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి.

మసాలా పేస్ట్: పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.

ఉడికించడం: పాన్‌లో నెయ్యి, నూనె వేసి సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత సిద్ధం చేసిన మసాలా పేస్ట్ వేసి ఒక నిమిషం ఉడికించాలి.

చికెన్: ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలిపి, మూత పెట్టి తక్కువ మంట మీద 12 నిమిషాలు ఉడికించాలి. చికెన్ తన సొంత నీటిలోనే ఉడుకుతుంది.

బియ్యం ఎసరు: చికెన్ ఉడికాక, 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల వేడి నీరు పోసి, నానబెట్టిన సిరగ సాంబా బియ్యాన్ని వేయాలి. నిమ్మరసం, ఉప్పు సరిచూసుకోవాలి.

దమ్ వేయడం: కుక్కర్ లేదా ఓవెన్ (200°C వద్ద 20 నిమిషాలు) ఉపయోగించి బియ్యాన్ని ఉడికించాలి. చివరగా మసాలాలు, చికెన్ ముక్కలు అన్నంతో కలిసేలా కదిపి వేడి వేడిగా రైతాతో వడ్డించాలి.

Follow Us
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం