Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 5 కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి..! అవేంటో తెలుసుకోండి..

Vegetables: యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు

ఈ 5 కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి..! అవేంటో తెలుసుకోండి..
Vegetables
Follow us
uppula Raju

|

Updated on: Sep 21, 2021 | 8:47 PM

Vegetables: యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తీవ్రమైన వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. అయితే ఈ 5 కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. బ్రోకలీ బ్రోకలీలో కెరోటినాయిడ్స్ లుటీన్, జియాక్సంతిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆకుపచ్చ కూరగాయ ఏడాది పొడవునా లభిస్తుంది. దీనిని మీరు అనేక విధాలుగా తినవచ్చు.

2. కిడ్నీ బీన్స్ కిడ్నీ బీన్స్‌లో ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

3. పాలకూర పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకు కూరలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవి కళ్లకు మేలు చేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పాలకూరతో మీరు చాలా రుచికరమైన వంటకాలు చేయవచ్చు.

4. టమోటా సాధారణంగా వంటకాల్లో అందరు టమోటాను వాడుతారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలనుకుంటే టమోటాని కచ్చితంగా డైట్‌లో చేర్చండి.

5. క్యాబేజీ క్యాబేజీ యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా వాపు, బరువు తగ్గడం, శరీరాన్ని డిటాక్సిఫై చేయడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

6. బంగాళాదుంప భారతీయులు బంగాళదుంపని చాలా ఇష్టపడుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ అధిక స్థాయిలో ఉంటాయి. ఇది విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్‌లకి మంచి మూలం. ఇది వాపును తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

ప్రపంచంలోని 2 ప్రదేశాలలో మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. అరుదైన పువ్వు గురించి తెలుసా..

KRMB Meeting: జల జగడంలో మరో ఎపిసోడ్.. ఏపీ చేస్తున్నవి నిరాధారమైన వాదనలు.. కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ..

Director Sekhar Kammula: చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమకావ్యాలే ‘‘లవ్ స్టోరీ ’’ కి ఇన్సిపిరేషన్.- శేఖర్ కమ్ముల