ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. బ్రహ్మాస్త్రం లాంటిది.. ఒక్క గ్లాస్ తాగితే ఇక తిరుగుండదు..

|

Oct 26, 2024 | 2:30 PM

బీట్‌రూట్ జ్యూస్ ఉదయం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తపోటు తగ్గుతుంది.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బీట్‌రూట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీన్ని జ్యూస్, సలాడ్‌లు, లేదా ఇతర వంటకాలలో చేర్చుకోవచ్చు. రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. బ్రహ్మాస్త్రం లాంటిది.. ఒక్క గ్లాస్ తాగితే ఇక తిరుగుండదు..
Beetroot Juice
Follow us on

బీట్‌రూట్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. మంచి ఆరోగ్యం కోసం బీట్‌రూట్ తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.. దుంప జాతికి చెందిన బీట్‌రూట్ చాలా పోషకమైన ఆహారం.. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోగాలు దగ్గరకు రానివ్వని బీటాలైన్లు కూడా ఇందులో ఉంటాయి. బీట్‌రూట్‌లో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫోలేట్, డైటరీ ఫైబర్ ఉంటాయి.. ఇది రక్తపోటును తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడం వంటి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిని జ్యూస్, సలాడ్, చట్నీ, సూప్, కూర.. ఇలా అనేక రకాలుగా తీసుకోవచ్చు.. ప్రతిరోజూ ఉదయం బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: మారుతున్న వాతావరణంలో జలుబు, దగ్గు మరియు జ్వరం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.. అటువంటి పరిస్థితిలో.. మీ రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటే అలాంటి వైరల్ వ్యాధులను నివారించగలుగుతారు. ఉదయాన్నే ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగే వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇది ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే అందులో విటమిన్ సి – యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
  2. కడుపు – జీర్ణసమస్యలు దూరం: మీరు తరచుగా గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, గుండెల్లో మంట లేదా అసిడిటీని ఎదుర్కొంటున్నట్లయితే, బీట్‌రూట్ రసం మీకు ఔషధంలా పని చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియ బరువును నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది.. ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నుండి కూడా మనలను కాపాడుతుంది.
  3. రక్తపోటు తగ్గుతుంది: మీరు అధిక రక్తపోటు బాధితులైతే.. బీట్‌రూట్ జ్యూస్‌ను మీ మార్నింగ్ డైట్‌లో చేర్చుకోవచ్చు. ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా లభిస్తుంది. దీని ద్వారా, రక్త నాళాలు విస్తరించవచ్చు.. తద్వారా పెరుగుతున్న రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులకు హైపర్‌టెన్షన్ ప్రధాన కారణమం.. అందుకే బీట్‌రూట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
  4. చర్మానికి మేలు చేస్తుంది: మనలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.. అటువంటి పరిస్థితిలో, బీట్‌రూట్ జ్యూస్ మీకు పరిష్కారం చూపుతుంది. నిజానికి, బీట్‌రూట్‌లో పుష్కలంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  5. ఇవి కూడా చదవండి

అయితే.. బీట్ రూట్ జ్యూస్ ఉదయం తీసుకోవడం చాలామంచిది.. ఒకవేళ తీసుకోలేకపోతే.. రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి