AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి ఏం చేస్తాయిలే అనుకునేరు.. పవర్‌ఫుల్ ఔషధం లాంటివి.. కొవ్వును కోసి బయటపడేస్తాయ్..

ప్రస్తుత కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం ఎంతైనా ఉంది. మెంతి గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. డయాబెటిస్ నియంత్రణ, బరువు తగ్గింపు, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదల, రక్తపోటు నియంత్రణ, జుట్టుకు బలం, చర్మ సంరక్షణ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మెంతిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇవి ఏం చేస్తాయిలే అనుకునేరు.. పవర్‌ఫుల్ ఔషధం లాంటివి.. కొవ్వును కోసి బయటపడేస్తాయ్..
Fenugreek SeedsImage Credit source: Getty Images
Shaik Madar Saheb
|

Updated on: Oct 24, 2024 | 11:57 AM

Share

ఎన్నో సమస్యలు.. మరెన్నో రోగాలు.. ఇలా ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారుతోంది.. అందుకే.. మంచి జీవనశైలితోపాటు.. ఆరోగ్యకరమైన డైట్‌ను అనుసరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో మెంతులు, మెంతికూర ఒకటి.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మెంతి గింజలు అనేక సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.. సుగంధ ద్రవ్యాలైన మెంతి గింజలను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.. ఇది మన ఆరోగ్యంపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మెంతి గింజలు కొంచెం చేదుగా ఉన్నప్పటికీ.. సువాసన, రుచి పరంగా సాటిలేనివి.. అంతేకాకుండా లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులు, మెంతి కూరలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. పీచు, ప్రొటీన్, పిండి పదార్థాలు, కొవ్వు, ఐరన్ వంటి పోషకాలకు ఇది మంచి మూలం. అందుకే.. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతులు తినడం వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెంతి గింజల ప్రయోజనాలు..

  1. డయాబెటిస్ నిర్వహణ: మెంతులు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది ఇన్సులిన్ స్రావానికి సహాయపడే మోమోర్డిసిన్ అనే ప్రత్యేకమైన క్రియాశీల సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది.
  2. బరువు తగ్గుతుంది: మెంతి గింజలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఎందుకంటే ఇందులో కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి.. తద్వారా మనం ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.
  3. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: మెంతులు యాంటీఆక్సిడెంట్లు – ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇంకా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.
  4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: మెంతి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.. తద్వారా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
  5. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్: మెంతి గింజలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.. కాబట్టి అధిక బిపి ఉన్నవారు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి.
  6. జుట్టుకు బలం: మెంతులు పేస్ట్‌ని జుట్టు మీద అప్లై చేయడం వల్ల వెంట్రుకలు బలపడతాయి.. జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.
  7. రొమ్ము క్యాన్సర్ ను నివారిస్తాయి: రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి మహిళలు తప్పనిసరిగా మెంతి గింజలను తినాలి.. ఎందుకంటే వాటిలో ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి.. ఇవి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  8. చర్మానికి మేలు: మెంతి గింజల పేస్ట్ చర్మానికి మేలు చేస్తుంది.. చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. మచ్చలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్