AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapota Benefits: సపోటా ఇలా తింటే నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. శరీరంలో అద్భుతాలు చూస్తారు..!

ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. సపోటా స్ట్రెస్‌ను కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. పోటాలో వుండే యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సపోటాలో ఉండే విటమిన్ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. సపోటా నేరుగా తినవచ్చు లేదా జ్యూస్‌ కూడా తీసుకోవచ్చు.

Sapota Benefits: సపోటా ఇలా తింటే నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. శరీరంలో అద్భుతాలు చూస్తారు..!
sapota
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2025 | 2:28 PM

Share

సపోటా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. సపోటా పండ్లలోని విటమిన్ ఎ, సి కంటికి మేలు చేస్తాయి. మంచి దృష్టిని రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని విష వ్యర్థాలను తొలగించి గుండెను రక్షించడంలో ఇది మేలు చేస్తుంది. శక్తిని ఇస్తుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. జీర్ణ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

సపోటాలో ఫైబర్, విటమిన్ బితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తాయి. సపోటాలలో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. పని చేసి అలసిపోయిన వారు ఈ పండ్లను తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది. సపోటా రెగ్యులర్‌గా తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. సపోటా స్ట్రెస్‌ను కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. పోటాలో వుండే యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సపోటాలో ఉండే విటమిన్ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. సపోటా నేరుగా తినవచ్చు లేదా జ్యూస్‌ కూడా తీసుకోవచ్చు.

ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు సపోటాలో ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. రోజూ సపోటా తింటే వృద్ధాప్యంలో ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు.. సపోటాలలోని ఫోలేట్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం ఎముకలను దృఢపరుస్తుంది. గర్భిణీ స్త్రీలు ఉదయాన్నే సపోటా తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..