Get Rid of Cockroaches: ఇలా చేశారంటే మీ ఇంటికి బొద్దింకలు రానే రావు..

|

Oct 18, 2024 | 1:17 PM

కిచెన్ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. కిచెన్‌ని ఎంత పరిశుభ్రంగా ఉంచినా ఒక్కోసారి కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి. దోమలు, ఈగలు, బొద్దింకలు వంటివి ఆహారాలపై వాలి పాడు చేస్తాయి. వీటితో పాటు రోగాలను కూడా మోసుకొస్తాయి. దోమలు, ఈగలు, బొద్దింకలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బొద్దింకలను ఎన్ని సార్లు వెళ్లగొట్టినా..

Get Rid of Cockroaches: ఇలా చేశారంటే మీ ఇంటికి బొద్దింకలు రానే రావు..
Cockroaches
Follow us on

కిచెన్ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. కిచెన్‌ని ఎంత పరిశుభ్రంగా ఉంచినా ఒక్కోసారి కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి. దోమలు, ఈగలు, బొద్దింకలు వంటివి ఆహారాలపై వాలి పాడు చేస్తాయి. వీటితో పాటు రోగాలను కూడా మోసుకొస్తాయి. దోమలు, ఈగలు, బొద్దింకలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బొద్దింకలను ఎన్ని సార్లు వెళ్లగొట్టినా మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి. ఎక్కువగా గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ దగ్గర తిరుగుతూ ఉంటాయి. బొద్దింకల బెడద తొలగించుకోవడానికి ఇప్పటికే ఎన్నో రకాల చిట్కాలు తెలుసుకున్నాం. మీ కోసమే ఇప్పుడు మరికొన్ని కొత్త టిప్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చాం. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ రంగు లేకుండా చూడండి:

పలు అధ్యయనాల ప్రకారం బొద్దింకలు.. పసుపు రంగుకు ఆకర్షితమువతాయట. కాబట్టి మీ వంట గదిలో ఈ రంగు లేకుండా చూసుకోండి. బొద్దింకలకు ఎదురుగా పసుపు రంగు కనిపించకుండా చేయండి. దీంతో ఇవి పెద్దగా రాకుండా ఉంటాయి.

దోసకాయ:

దోసకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ దోసకాయ వాసన బొద్దింకలకు పడదు. కాబట్టి బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట దోసకాయను ముక్కలుగా కట్ చేసి పెట్టండి. సింక్ కింద.. గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టండి. ఈ వాసనకు బొద్దింకలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

బోరిక్ పౌడర్:

బొద్దింకలు ఒకటి, రెండు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయండి. ఇవి రోజురోజుకూ ఎక్కువ అవుతాయి. బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటే.. అక్కడ బోరిక్ పౌడర్ చల్లండి. లేదంటే వాటర్‌లో కలిపి స్ప్రే చేయండి.

సబ్బు నీళ్లు:

సబ్బు నీళ్ల వాసన కూడా బొద్దింకలకు పడదు. కాబట్టి అక్కడక్కడా బట్టల సబ్బు ముక్కలు లేదా బాడీ సోప్ ముక్కలు పెడుతూ ఉండండి. లేదంటే బట్టల సబ్బును నీటిలో కరగబెట్టి.. బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట స్ప్రే చేయండి.

క్లీన్‌గా ఉంచండి:

చాలా మంది పనుల హడావిడిలో ఒక్కోసారి కిచెన్ క్లీన్ చేయరు. ఆహార పదార్థాలు కింద పడకుండా చూడండి. రాత్రి పూట ఖచ్చితంగా కిచెన్ క్లీన్ చేయండి. ఈ సమయంలోనే బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..