శీతాకాలం వచ్చిందంటే చాలు శారీరక సమస్యలు బయటపడతాయి. శీతాకాలంలో వర్క్ అవుట్స్ చేయడానికి బద్ధకించడంతో అన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శీతాకాంలో బాగా ఇబ్బందిపెట్టే సమస్య అజీర్ణం. శారీరక వ్యాయామం లేకపోవడంతో పాటు సరైన ఆహారం తీసుకోకపోవడంతో అజీర్తి సమస్యలతో బాధపడుతుంటాం. సాధారణంగా శీతాకాంలో పేగు సమస్యలు, గుండెల్లో మంట, ఉబ్బసం, ఇతర జీర్ణ సమస్యలకు గురవుతుంటాం. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఆహార నియమాలను మార్పు చేసుకోవాలి. వాటితో పాటు ఇంటి వద్దే ఉండి కొన్ని యోగసనాలు చేస్తే మరిన్ని ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ క్రియను మెరుగుపర్చడానికి కొన్ని యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కాళ్లను జాపి కూర్చోవాలి. అనంతరం తలను కాళ్లకు వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. ఈ సమయంలో పాదాలను పట్టుకోడానికి చేతులను ఉపయోగించాలి. ఈ భంగిమలో మీ కడుపు, చాతి తొడలను తాకాలి. ఇదే స్థితిలో 10 నుంచి 20 సెకన్ల పాటు ఉండాలి. ఇలా వీలైనన్ని సార్లు చేయాలి.
ముందుగా మీ కాళ్లు మడత బెట్టి కూర్చోవాలి. ఈ సమయంలో పాదాలు పైకి ఉండాలి. ఇప్పుడు మెల్లగా తలని నేలపైకి వంచాలి. ఈ సమయంలో వీలైనంతగా చేతులను ముందుకు చాపాలి. ముఖం నేలతో పాటు అరచేతులకు ఎదురుగా ఉండాలి. ఈ సమయంలో అరచేతులను నేలకు తాకించాలి. ఇలా 10-15 సెకన్లపాటు రోజుకు 4-5 సార్లు చేయాలి.
నిటారుగా నిలబడి ముందుకు వంగాలి. శరీరానాన్ని సగం పైగా వంచి మోకాళ్లను వంచకుండా అరచేతులను నేలకు తాకించడానికి ప్రయత్నించాలి. నేలకు తాకకపోతే కనీసం కాళ్ల వేళ్లనైనా తాకడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో ముఖం కాళ్లకు ఎదురుగా ఉండాలి. ఈ భంగిమ వీలైనంత సేపు ఉండాలి.
మీ చేతులను నేలను తాకేలా కింద కూర్చోవాలి. ఎడమ చేతిని గాల్లోకి లేపుతూ కుడి వైపునకు స్లోగా వాలాలి. ఈ సమయంలో కుడి ముంజేతిని అరచేతిని బయటకు చూపిస్తూ నేలపై ఉంచాలి. నెమ్మదిగా నాలుగైదు సార్లు గాలి పీల్చాలి.
మీ పొట్టపై బోర్లా పడుకోవాలి. ఈ సమయంలో చేతులను, కాళ్లను నిటారుగా ఉంచాలి. మోకాళ్లను వెనక్కి వంచేటప్పడు మీ పాదాలను పిరుదులకు వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. వెనుక చేత్తో శీలమండలను జాగ్రత్తగా పట్టుకోవాలి. మీరు మీ పాదాలను మీ మొండెంకి దగ్గరగా లాగేటప్పుడు మీ తొడలను నేల నుంచి కొంచెం పైకి ఎత్తాలి. మీ తల, చాతీ రెండింటినీ ఒకే సమయంలో ఎత్తాలి. ఇదే పొజిషన్ లో ఉండి 4-5 సార్లు గాలి పీల్చాలి. ఇలా వీలైనన్ని సార్లు చేస్తే అజీర్తి సమస్యల నుంచి బయటపడవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..