పొట్ట ఐస్‌లా కరగాల్సిందే.. రోజూ సోంపును ఇలా తీసుకుంటే అద్భుతాలే..
వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలు కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా అమృతంతో సమానం. ముఖ్యంగా ఊబకాయం, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుతో బాధపడేవారికి సోంపు ఒక వరం లాంటిది. సోంపును సరైన పద్ధతిలో తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం. జిమ్‌లకు వెళ్లలేక, కఠినమైన డైట్ చేయలేక ఇబ్బంది పడేవారికి మన వంటింట్లో ఉండే సోంపు అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకే కాకుండా పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో సోంపు కీలకంగా పనిచేస్తుంది.
సోంపుతో బరువు తగ్గడం ఎలా?
మేజిక్ డ్రింక్ – సోంపు నీరు
ఒక చెంచా సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మరిగించి, వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే శరీరంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు.
వెయిట్ లాస్ సోంపు టీ
ఒక గ్లాసు నీటిని మరిగించి, అందులో ఒక చెంచా సోంపు, చిన్న అల్లం ముక్క వేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేసి రెండు నిమిషాలు మూత పెట్టాలి. ఆ తర్వాత వడకట్టి, అర చెంచా తేనె కలుపుకుని తాగాలి. ఇది జీవక్రియను వేగవంతం చేసి కొవ్వును త్వరగా కరిగిస్తుంది.
జీర్ణక్రియ కోసం సోంపు పొడి
సోంపును పాన్ మీద 2-3 నిమిషాలు దోరగా వేయించి, చల్లారాక మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత ఒకటి లేదా రెండు చిటికెల పొడిని తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
శక్తివంతమైన సోంపు సురాణం
4 చెంచాల సోంపు, 2 చెంచాల జీలకర్ర, 2 చెంచాల మెంతులు కలిపి వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో ఒక చెంచా పసుపు, ఒక చెంచా నల్ల ఉప్పు, తగినంత తేనె కలిపి చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. రోజుకు ఒక ఉండ చొప్పున తీసుకుంటే శరీరంలోని అసమతుల్యత తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఎందుకు వాడాలి?
సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దే సహజ పద్ధతిలో బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం అవగాహన కోసమే. దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఏమైన పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
