Skincare Tips: కీరాను ఇలా ఉపయోగించారంటే.. వేసవిలో ఎదురయ్యే చర్మ సమస్యలకు అడ్డుకట్ట వేసినట్లే..!

వేసవికాలంలో చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ క్రమంలో చర్మం హైడ్రేట్‌గా లేకపోతే జీవం కోల్పోయి కళా విహీనమవుతుంది. అయితే వేసవిలో..

Skincare Tips: కీరాను ఇలా ఉపయోగించారంటే.. వేసవిలో ఎదురయ్యే చర్మ సమస్యలకు అడ్డుకట్ట వేసినట్లే..!
Keera For Summer Skincare
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 06, 2023 | 9:50 AM

చాలా మంది తమ శరీరం డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే శరీరం ఒక్కటే కాదు చర్మం కూడా డీ హైడ్రేట్ అవుతుంది. అందువల్ల ఆ సమస్య ఎదురు కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చర్మం పొడిబారిపోయి.. చర్మంపై దద్దుర్లు, దురద వంటి పలు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ క్రమంలో చర్మం హైడ్రేట్‌గా లేకపోతే జీవం కోల్పోయి కళా విహీనమవుతుంది. అయితే వేసవిలో ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఒకే ఒక మాస్క్ చాలంటున్నారు చర్మ, ఆరోగ్య నిపుణులు. అదేమిటంటే కీరా దోస. కీరా అనేది ఆరోగ్యపరంగా అద్భుతమైన పదార్ధం.

కీరా విశేషమేమిటంటే.. ఇందులో 95 శాతం నీరే ఉంటుంది. అందుకే కీరా ఎక్కువగా సేవించడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచవచ్చని నిపుణులు అంటున్నారు. కీరా అనేది కేవలం ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా అద్భుతంగా ఉపయోగడుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. కీరాతో ఫేసియల్ చేయడం వర్ల చర్మం లోపలి నుంచి కూడా హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా మీ చర్మం జీవం కోల్పోకుండా కళకళలాడుతుంటుంది. ఇంకా సూర్యుని తాపం, టాన్నింగ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కూడా కీరా ఉపయోగపడుతుంది. దీంతోపాటు కీరాలో పుష్కలంగా ఉండే యాంటీ ఏజీయింగ్ గుణాల కారణంగా వయస్సు పెరిగినా ఆ లక్షణాలు దూరంగా ఉంటాయి.

కీరా ఫేసియల్ మాస్క్ తయారీ విధానం:

కీరా ఫేసియల్ తయారు చేసేందుకు కీరా రసం, రోజ్ వాటర్, మినరల్ వాటర్ ఉంటే చాలు. ముందుగా ఒక కీరా దోసను తీసుకుని ముక్కలు చేసి మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ రసంలో రోజ్ వాటర్, మినరల్ వాటర్ కలపాలి. అన్నింటిని బాగా కలపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ పుదీనా రసం కలిపితే ఇంకా బాగుంటుంది. రోజుకు 2 సార్లు ఈ మిశ్రమాన్ని ముఖంపై స్ప్రే చేసుకుని ఓ 20 నిమిషాలు అలా ఉంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఎప్పుడూ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి