షుగర్ కేన్ జ్యూస్ తో స్కిన్ కి ప్రత్యేక చిట్కాలు
షుగర్ కేన్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా అందానికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టిలో చెరకు రసం కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తే నల్లమచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. తేనె కలిపి స్కిన్ కి అప్లై చేస్తే సాఫ్ట్ గా మారుతుంది. ట్యాన్ తొలగించేందుకు నెయ్యి, చెరకు రసం మిశ్రమం బాగా పనిచేస్తుంది. హెయిర్ కి చెరకు రసాన్ని పట్టించి కడిగితే సిల్కీగా, మెరిసేలాగ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ప్రతి రోజు చెరకు రసాన్ని మీరు కూడా ఉపయోగించి సహజ అందం పొందండి.
షుగర్ కేన్ జ్యూస్ కేవలం తాగడానికి రుచికరం ఇవ్వడమే కాకుండా.. ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని మీకు తెలుసా..? ఈ షుగర్ కేన్ జ్యూస్ మీ స్కిన్ అందాన్ని పెంచడంతో పాటు హెయిర్ ని కూడా హెల్తీగా ఉంచుతుంది. కానీ ఇది ఇప్పుడు ఎలా ఉపయోగిస్తారో చూద్దాం.
షుగర్ కేన్ తో స్కిన్ గ్లో
చెరకు రసాన్ని స్కిన్ కి ఉపయోగించడం వల్ల నల్లమచ్చలు, మొటిమలు తగ్గడంతో పాటు మీ స్కిక్ కాంతివంతంగా మారుతుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా చెరకు రసం కలిపి పేస్ట్ తయారు చేసి ఫేస్ కి పట్టిస్తే నల్ల మచ్చలు తొలగిపోతాయి. అలాగే, చెరకు రసంలో తేనె కలిపి స్కిన్ కి మర్దన చేసి, కాసేపు ఆగి వాష్ చేసుకోవాలి. ఇది మీ స్కిన్ ని సాఫ్ట్ గా చేస్తుంది.
స్క్రబ్‌గా షుగర్ కేన్ జ్యూస్
కాఫీ పొడికి చెరకు రసం కలిపి స్క్రబ్ చేయడం వల్ల స్కిన్ పై పొర తొలగి కాంతివంతంగా ఉంటుంది. మరోవైపు, నిమ్మరసం, యాపిల్ జ్యూస్, ద్రాక్ష రసం, కొబ్బరి పాలు, చెరకు రసం సమపాళ్లలో కలిపి ఫేస్ కి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గి మీ స్కిన్ మెరుస్తుంది.
ఐస్ క్యూబ్ ట్రిక్ తో నిత్య యవ్వనం
చెరకు రసంతో తయారు చేసిన ఐస్ క్యూబ్‌లను ఫేస్ పై అప్లై చేస్తే మీ స్కిన్ యవ్వనంగా, బిగుతుగా మారుతుంది. అదే విధంగా, బొప్పాయి గుజ్జులో చెరకు రసం కలిపి పట్టించడం వల్ల కూడా స్కిన్ కొత్త కాంతిని పొందుతుంది.
స్కిన్ ట్యాన్ కి షుగర్ కేన్ తో చెక్
4 టేబుల్ స్పూన్ల చెరకు రసానికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి స్కిన్ కి మర్దన చేయాలి. దీంతో ట్యాన్ అయిన మీ స్కిన్ మెరిసిపోతుంది. అలాగే లీటర్ నీటిలో కొన్ని పుదీనా ఆకులు, కొంచం చెరకు రసం కలిపి మరిగించి ఆవిరి పట్టుకుంటే మీ స్కిన్ ఫేర్ గా మారుతుంది.
హెయిర్ కి షుగర్ కేన్ జ్యూస్
చెరకు రసాన్ని మీ జుట్టుకి పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మీ జుట్టు మెరిసిపోతుంది. ఇది సహజసిద్ధమైన కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇలా ఈ జ్యూస్ ని తాగడం, అవసరానికి మీ స్కిన్ కి, హెయిర్ కి ఉపయోగించడం ద్వారా అందాన్ని మరింత పెంచుకోవచ్చు.