Fashion show : విశాఖలో శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఫైనల్.. ర్యాంప్ పై హంస నడకలతో అదరగొట్టిన ఆంటీలు.!

Srimathi Vizag traditional fashion show : సాగరతీర నగరం విశాఖలో శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఫినాలే ఘనంగా జరిగింది...

Fashion show : విశాఖలో శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఫైనల్..  ర్యాంప్ పై  హంస నడకలతో అదరగొట్టిన ఆంటీలు.!
Smt Vizag Fashion Show
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 18, 2021 | 10:03 AM

Srimathi Vizag traditional fashion show : సాగరతీర నగరం విశాఖలో శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఫినాలే ఘనంగా జరిగింది. ర్యాంప్ పై హంస నడకలతో ఆంటీలు అదరగొట్టారు. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్, డ్రస్సింగ్ లతో మస్తు పెర్‌ఫార్మెన్స్ ను ప్రదర్శించారు. తేజాస్ ఎలైట్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీమతి వైజాగ్ ఫైనల్స్ లో 16 మంది మహిళలు పోటీ పడ్డారు. తన అద్భుతమైన ప్రదర్శన తో శ్రీమతి వైజాగ్ టైటిల్ ని శ్రీమతి సౌజన్య కైవసం చేసుకున్నారు. సెకండ్ రన్నరప్ గా శ్రీమతి ప్రశాంతి, ఫస్ట్ రన్నరప్ గా శ్రీమతి అలేఖ్య నిలిచారు. ఈ కార్యక్రమంలో సినీనటి అర్చన ముఖ్య అతిథిగా, ఆత్మీయ అతిథులుగా సినీ నటుడు ప్రసన్నకుమార్ హాజరయ్యారు. జబర్దస్త్ టీం రైజింగ్ రాజు, దొరబాబు, తన్మయి, ఆద్యంతం వినోదంతో అలరించి నవ్వుల పువ్వులు పండించారు. కాగా, ఏప్రిల్ 10 వ తేదీన విశాఖలోని ఓ హోటల్​లో శ్రీమతి వైజాగ్ పోటీల ఆడిషన్స్ జరిగిన సంగతి తెలిసిందే. 30 మందికి పైగా మహిళలు ఆరోజు ఆడిషన్స్‌లో పాల్గొన్నారు.

Read also : Humanity : రైలు కిందపడి కోవిడ్ రోగి సూసైడ్, అంత్యక్రియలకు ముందుకురాని కుటుంబం, మానవత్వం చాటుకున్న ముస్లిం యువత