Baby Names with S: మీ పిల్లల కోసం S అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లను చూస్తున్నారా.. అయితే ఈ పేర్లపై లుక్ వేయండి..

|

Aug 16, 2022 | 8:39 AM

పిల్లలకి పేరు పెట్టేసమయంలో తల్లిదండ్రులు కొన్ని అక్షరాలతో మొదలయ్యేలా పేర్లను వెదుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు S అక్షరంతో ప్రారంభమయ్యే పేర్ల కోసం చూస్తున్నారా?

Baby Names with S: మీ పిల్లల కోసం S అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లను చూస్తున్నారా.. అయితే ఈ పేర్లపై లుక్ వేయండి..
Baby Names With S
Follow us on

Baby Names with S: సనాతన సంప్రదాయంలో పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడం ఆ పిల్లల జీవితంలో ముఖ్యఘట్టం..  నామకరణ మహోత్సవంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాదు.. పిల్లలకు పెట్టె పేర్ల విషయంలో కూడా పుట్టిన సమయం, నక్షత్రం వంటి వాటికి అనుగుణంగా ఇప్పటికీ పేర్లను ఎంచుకునే వారున్నారు. ముఖ్యంగా ఇంట్లో తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మలు ఉన్నఇంట్లో ఇప్పటికీ నామకరణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అవును పిల్లల కోసం సరైన పేరును ఎంచుకోవడం చాలా అవసరం. పెద్దల పేర్లను గుర్తు చేసే విధంగా కూడా పేర్లు పెట్టేవారున్నారు. ఏదిఏమైనా పిల్లలకు పెట్టె పేర్ల ఎంపిక అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఎందుకంటే వారు తమ జీవితాంతం వరకు ఆ పేరు గుర్తింపుతో జీవిస్తారు. పిల్లలకి పేరు పెట్టేసమయంలో తల్లిదండ్రులు కొన్ని అక్షరాలతో మొదలయ్యేలా పేర్లను వెదుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు S అక్షరంతో ప్రారంభమయ్యే పేర్ల కోసం చూస్తున్నారా? ఈరోజు ఆడపిల్లలకు, లేదా మగపిల్లలకు S అక్షరంతో ప్రారంభమయ్యే కొన్ని పేర్లను.. వాటి అర్ధాలను గురించి ఇక్కడ ఇస్తున్నాం.. తల్లిదండ్రులకు పేర్లను వెదికే పని మరింత సులభమవుతుంది..

S అక్షరంతో ఆడపిల్లల పేరు.. వాటి అర్థాలు:
సాచి అంటే “సత్యం”.
సారా అంటే “విలువైన” అని అర్థం
సయేషా అంటే “గొప్ప కోరిక ..  కోరికతో”.
సంజన అంటే “జెంటిల్” అని అర్థం.
శయన అంటే “అందమైన”
స్మనా అంటే “అందమైన మనస్సు”
సోనమ్ అంటే “అందమైన”.
శ్రీషా “పువ్వు”ని సూచిస్తుంది.
సుమైరా అంటే “గోధుమ రంగు”.
సాహిబ “ది లేడీ” అని సూచిస్తుంది.

S అక్షరంతో అబ్బాయిల పేర్లు.. వాటి అర్థం:
సక్షం అంటే “ఎవరికి ఏదైనా సాధ్యమే”.
సశ్విన్ అంటే “సృజనాత్మకం”.
సమర్థ్ అంటే “శక్తిమంతుడు”.
శల్యుడు “బాణం”.
షేన్ “దేవుని బహుమతి”.
షార్విన్ అంటే “విజయం”
శాశ్వాత్  అంటే   “స్థిరంగా”
స్వాంత్  అంటే “ప్రశాంతత”.
స్వాంగ్ “మంచి లుక్ ” ఉన్న అబ్బాయి,
శ్రీయాన్ష్ అంటే “సంపద” అని సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..