
భారతదేశంలో ఆరోగ్యకరమైన అల్పాహారంగా గుడ్డును పరిగణిస్తారు. అధిక ప్రోటీన్ కంటెంట్, మంచి కొవ్వులు , ముఖ్యమైన ఖనిజాలతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు గుడ్డు ద్వారా అందుతాయి. అందువల్ల చాలా మంది ఉదయం అల్పాహారంతో పాటు గుడ్డును తింటే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొంటున్నారు. అయితే గుడ్డు విషయంలో చాలా మంది కొన్ని అపోహలతో దూరం పెడుతూ ఉంటారు. ఆ అపోహలు నుంచి బయటపడి ఆరోగ్యకరమైన గుడ్డును తినాలని నిపుణుల సూచిస్తున్నారు. గుడ్డుపై ఉన్న అపోహలు వాటిపై నిపుణులు తెలిపే అసలు విషయాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
నిజం: ఇది గుడ్లు గురించి చాలా సాధారణ అపోహలలో ఒకటి. అవి అధిక కొలెస్ట్రాల్ కంటెంట్ కారణంగా హృదయ ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ గుడ్లు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచదని అధ్యయనాలు కనుగొన్నాయి. అలాగే గుడ్డు సొనలు ఎల్‌డీఎల్ (చెడు), హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే కొవ్వులను కలిగి ఉంటాయి.
నిజం: చాలా మంది ప్రజలు పచ్చి గుడ్లల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అనుకుంటారు. కానీ పచ్చి గుడ్లను తీసుకోవడం ప్రమాదకరం. పచ్చి గుడ్లు సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి, ఇవి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. వాంతులు, విరేచనాలు, జ్వరానికి దారితీస్తుంది. కాబట్టి గుడ్లను ఉడకబెట్టి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నిజం: గుడ్డులోని తెల్లసొన మాత్రమే పోషకమైనదని, అందులోని పచ్చసొనలో కొవ్వు, కేలరీలు ఉంటాయని చెబుతుంటారు. అయితే నిపుణులు మాత్రం గుడ్డు పచ్చ సొనలో తెల్లసొనలో లేని అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. వీటిలో విటమిన్లు ఏ,డీఈ,కే ఉంటాయి. కాబట్టి గుడ్డును మాత్రం మొత్తం తినాలని నిపుణులు పేర్కొంటున్నారు.
నిజం: కొంతమంది గుడ్లు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నమ్ముతారు. గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తిన్నవారికి కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది. అతిగా తినడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం మీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.
నిజం: చాలా మంది ముదురు రంగు కారణంగా నాటు గుడ్లు మేలని అనుకుంటారు. అయితే, గుడ్డు పెంకు రంగు దాని పోషక విలువ లేదా నాణ్యతను ప్రభావితం చేయదని నిపుణులు చెబుతున్నారు. కోడి జాతిని అనుసరించే గోధుమ లేదా తెలుపు గుడ్లు వస్తాయని తెలుసుకోవాలని చెబుతున్నారు.
నిజం: కొలెస్ట్రాల్ కంటెంట్ కారణంగా మధుమేహం ఉన్నవారు గుడ్లు తినకూడదనేదని అనుకుంటారు. అయితే గుడ్లు మితంగా తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే గుడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయం చేస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ సమాచారం కోసం క్లిక్ చేయండి.