చెప్తేనే గుర్తుంటుంది.. పోటీ పరీక్షలకు వెళ్లేవారికి ఎవరూ చెప్పని టిప్స్..
ఎంత చదివినా ఓ పట్టాన గుర్తుండటం లేదా? చదివిన వెంటనే మర్చిపోతున్నారా? అయితే ఈ టెక్నిక్స్ మీకోసమే. ఓ సారి ఈ టిప్స్ ట్రై చేసి చూడండి. ఒక్కసారి చదివినా ఎక్కువ కాలం గుర్తుంచుకోగలరు. నోటితో చదివి వదిలేయకుండా చదివిన విషయాన్ని మెదడు వరకు తీసుకెళ్లండి. పెద్ద మొత్తంలో ఉన్న విషయాలను సింప్లిఫై చేసుకునేందుకు చార్ట్ డయాగ్రామ్స్ చక్కగా పనిచేస్తాయి.

పరీక్షల సీజన్ దగ్గరపడుతోంది. మరికొన్ని వారాల్లో బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. పరీక్షలకు ఎంత చదివినా ఓ పట్టాన గుర్తుండకపోయినా.. చదివిన వెంటనే మర్చిపోతున్నారా? అయితే ఈ టెక్నిక్స్ మీకోసమే. ఓ సారి ఈ టిప్స్ ట్రై చేసి చూడండి. ఒక్కసారి చదివినా ఎక్కువ కాలం గుర్తుంచుకోగలరు. నోటితో చదివి వదిలేయకుండా చదివిన విషయాన్ని మెదడు వరకు తీసుకెళ్లండి. పెద్ద మొత్తంలో ఉన్న విషయాలను సింప్లిఫై చేసుకునేందుకు చార్ట్ డయాగ్రామ్స్ చక్కగా పనిచేస్తాయి.
1. కాస్త ఆగి గుర్తుచేసుకోండి..
చదివింది చదివినట్టు బట్టీ పట్టకుండా ఒకసారి చదివి పుస్తకం పక్కన పెట్టండి. ఇప్పటివరకు మీరేం చదివారో ఓసారి గుర్తుచేసుకోండి. అందులోని సారాంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేసుకునే రివ్యూను ఒక రోజు ఆ తర్వాత ఒక వారం, ఒక నెల.. ఇలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో విషయాన్ని మననం చేసుకుంటే ఇక ఆ విషయాన్ని మర్చిపోయే అవకాశమే ఉండదు.
2. మూస ధోరణి వద్దు..
చదివిన విషయాన్ని రీకాల్ చేసుకునేందుకు ప్రయత్నించండి. నోట్స్ మూసేసి మీకు మీరే అందులోని కీ పాయింట్స్ ను గుర్తుచేసుకోండి. ఇది మీ మెమరీ పవర్ ను, అర్థం చేసుకునే కెపాసిటీని పెంచుతుంది.
3. సెల్ఫ్ చెక్ అవసరమే..
చదివిన విషయాన్ని ఫ్లాష్ కార్డ్స్, పాస్ట్ పేపర్స్ ద్వారా కనిపించేలా పెట్టుకోండి. మిమ్మల్ని మీరు సబ్జెక్ట్ మీద ఎంత పట్టు సాధించారో చెక్ చేసుకోవాలి. మీకు మీరే క్విజెస్ పెట్టుకుని నాలెడ్జ్ ను పరీక్షించుకోవాలి. అసలు పరీక్షల కన్నా ముందు మిమ్మల్ని పరీక్షించుకుంటే అది మీలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది.
4. మైండ్ మ్యాపింగ్ తెలుసా?..
నోటితో చదివి వదిలేయకుండా చదివిన విషయాన్ని మెదడు వరకు తీసుకెళ్లండి. గుర్తుంచుకోవడానికి మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ను ఉపయోగించండి. విజువల్ డయాగ్రామ్స్ ద్వారా చదివిన వాటిని మీ ఐడియాలతో జత చేయండి. ఇలా ఆర్గనైజ్డ్ గా ఉండటం వల్ల కఠినమైన విషయాలను కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. కీ డీటెయిల్స్ ను మర్చిపోకుండా ఉండొచ్చు.
5. ఇవి కూడా ట్రై చేయండి..
పెద్ద మొత్తంలో ఉన్న విషయాలను సింప్లిఫై చేసుకునేందుకు చార్ట్ డయాగ్రామ్స్ చక్కగా పనిచేస్తాయి. డయాగ్రామ్స్ ద్వారా కూడా సబ్జెక్ట్ ను చక్కగా రీకాల్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ సోర్సెస్ ద్వారా చదివిన విషయాలను మర్చిపోకుండా ఉండొచ్చు.
6. పొమొడోరో టెక్నిక్ అంటే..?
మనం ఎన్ని గంటలు చదివినా మెదడు ఫోకస్ చేసే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఇక స్మార్ట్ ఫోన్ వినియోగించేవారిలో ఇది మరీ తక్కువ. అందుకే 30 మినట్ రూల్ ను గుర్తుంచుకోవాలి. అంటే 25 నిమిషాలు చదివి ఆపేయాలి. ఆ తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఇది మిమ్మల్ని సబ్జెక్ట్ నుంచి పక్కదారి పట్టకుండా చేస్తుంది.
7. చెప్తేనే గుర్తుంటుంది..
చదివింది ఎంత సీక్రెట్ గా ఉంచితే అంత తక్కువ సమయం బుర్రలో ఉంటుంది. అదే దాన్ని ఇతరులకు ఎక్స్ ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. అది కూడా క్లిష్టతరంగా కాకుండా సింపుల్ గా విషయాన్ని అర్థమయ్యేలా మీరు చెప్తున్నారో లేదో పరీక్షించుకోండి. ఒకవేళ అర్థంకాకుంటే మీకు అర్థమయ్యేవరకు టాపిక్ ను రీవిజిట్ చేయండి.