
రొట్టె, అన్నం ఒకేసారి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా హానికరం కావచ్చు అంటున్నారు. వాటిని కలిపి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రెండింటిలోనూ వేర్వేరు పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మంచివి కావు. ఈ రెండిట్లో ఉండే పోషకాల వలన శరీరంలో జీవ ప్రక్రియకు గురవుతూ ఉంటాయి. వాటి గ్లైసోమిక్ సూచిక కూడా చాలా అధికంగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.
చపాతీ, అన్నం రెండూ కలిపి తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, ఇతర కడుపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలోనూ కార్బోహైడ్రేట్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో స్టార్చ్ శోచించబడుతుంది. ఈ రెండిటిని కలిపి తింటే అజీర్ణం పోవడమే కాకుండా కడుపుబ్బరం సమస్య పెరుగుతుంది. కాబట్టి, వీటిని కలిపి తినడం వల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోతాయి. దీంతో బరువు పెరుగుతారని అంటున్నారు.
కాబట్టి చపాతి,అన్నం కలిపి తినడం ఇక మీదట మానుకోవడం చాలా మంచిది. ఈ రెండు కలిపి తినడం కాకుండా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పదార్థాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఈ రెండు తీసుకోవాలి అనుకున్న వారు కచ్చితంగా ఆ రెండింటికి మధ్య కాసేపు గ్యాప్ ఉంచాలి. ఆపై రెండు గంటల తర్వాత అన్నం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రెండిట్లో ఉండే పోషకాహారాన్ని పొందవచ్చు. ఇలా వేరువేరుగా తినడం వలన గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు రావు.
చపాతి, అన్నం కలిపి తీసుకోవడం వలన వీటిలో ఉండే పోషకాలు శరీరంలో ఘర్షణ ఏర్పడుతుంది. ఇది వాటి శోషణకు ఆటంకం కలిగిస్తుంది. కొన్ని కొన్ని సార్లు కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..