Guava Fruits: ఏ టైంలో జామ పండ్లు తింటే సులువుగా బరువు తగ్గొచ్చో తెలుసా?
What is the benefits of eating Guava? జామ పండులో విటమిన్ సి,ఫైబర్ పుష్కలంగా ఉండటమే కాకుండా, ఇది యాంటీఆక్సిడెంట్లకు 'పవర్‌హౌస్' కూడా. జామను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జామకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్, పొటాషియం, ఫైబర్ వంటి.

చౌకగా, అత్యంత సులభంగా లభించే పోషకమైన పండ్లలో జామ మొదటి వరుసలో ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి,ఫైబర్ పుష్కలంగా ఉండటమే కాకుండా, ఇది యాంటీఆక్సిడెంట్లకు ‘పవర్‌హౌస్’ కూడా. జామను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జామకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్, పొటాషియం, ఫైబర్ వంటి అనేక ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ మూలకాలు వివిధ ముఖ్యమైన శరీర విధులు సజావుగా సాగడానికి సహాయపడతాయి. కానీ ఈ పండు పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ఏ టైంలో తింటున్నారనేది కూడా చాలా ముఖ్యం.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్నం భోజనం ముందు
ఉదయం భారీ అల్పాహారం తర్వాత లేదా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జామపండు తినడం చాలా మంచిది. ఈ సమయంలో జామపండు తినడం వల్ల శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. జామపండులోని ఫైబర్, సహజ చక్కెరలు రోజంతా మీకు శక్తినిస్తాయి. దీనితో పాటు జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇది కడుపుని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను పెంచడంలో కూడా పాత్ర పోషిస్తుంది.
భోజనానికి ముందు లేదా తర్వాత
జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందు జామపండు తినడం వల్ల అతిగా తినడం నివారించవచ్చు. బరువు నియంత్రణలో కూడా చాలా సహాయపడుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మధ్యాహ్నం చిరుతిండిగా
మధుమేహ వ్యాధిగ్రస్తులు మధ్యాహ్నం ఓ జామపండు తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
తొక్కతో కలిపి నమిలి తినాలి
జామ తొక్క, గింజలలో అత్యధిక యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. కాబట్టి దానిని బాగా కడిగి తొక్కతో కలిపి నమలి తినాలి. ఇది మంచి దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది.
రోజుకి ఒక జామ పండు చాలు
రోజూ ఒక మీడియం సైజు జామపండు తింటే సరిపోతుంది. ఎక్కువ జామపండు తినడం వల్ల ఒకేసారి చాలా ఫైబర్ శరీరంలోకి చేరి, కడుపులో అసౌకర్యం లేదా గ్యాస్ ఏర్పడవచ్చు.
చక్కెర జోడించడం వద్దు
జామ సహజంగానే తియ్యగా ఉంటుంది. దీన్ని జ్యూస్ చేసేటప్పుడు లేదా మరేదైనా విధంగా తినేటప్పుడు పొరపాటున కూడా దీనికి చక్కెరను జోడించవద్దు. ఇది పండు సహజ లక్షణాలను తగ్గిస్తుంది. కేలరీల కంటెంట్‌ను పెంచుతుంది.
సలాడ్ లేదా పెరుగుతో రుచిగా
జామపండును చిన్న ముక్కలుగా కోసి, ఫ్రూట్ సలాడ్ లేదా పెరుగుతో కలిపి తినడం వల్ల దాని పోషక విలువలు మరింత పెరుగుతాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




