
వంట చేయడానికి అనేక రకాల ఆయిల్స్‌ని ఉపయోగిస్తూ ఉంటాం. వంట నూనెల్లో చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో కల్తీ ఎక్కువగా పెరిగి పోవడం కారణంగా ఏది ఆరోగ్యానికి మంచిదో అన్న విషయం తెలుసుకోలేక పోతున్నాం. ఈ నూనెల్లో ఆలివ్ ఆయిల్ కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ఆలివ్ ఆయిల్‌ని బాగా ఉపయోగిస్తున్నారు. అందరి వంటింట్లో దాదాపు ఈ నూనె కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్‌తో కేవలం ఆరోగ్యమే కాకుండా చర్మ అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ నూనెతో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఆయిల్‌తో వంటలు తయారు చేసుకోవడం వల్ల ఎంతో మంచిది. అయితే ఆలివ్ ఆయిల్‌లో ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఎంచుకోవడం మంచిది. ఇందులో అత్యధికమైన స్థాయిలో లాభాలు ఉంటాయి. ఆలివ్ ఆయిల్‌తో వంటలు తయారు చేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె పోటుతో అక్కడికక్కడే మృతిచెందుతున్న విషయం తెలిసిందే. ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల ఈ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరగకుండా.. రక్త పోటును అదుపులో ఉంచుతుంది.
ఆలివ్ ఆయిల్‌తో చేసే వంటల్లో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అదనంగా మీ శరీరంలో క్యాలరీలు చేరవు. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బరువు అనేది అదుపులో ఉంటుంది. ఈ ఆయిల్‌తో చేసిన వంటలు కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి ఎక్కువగా తినలేరు.
ఆలివ్ ఆయిల్‌తో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల మెదడు ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ అవుతాయి. ఆలివ్ ఆయిల్‌ను మీ పిల్లలకు పెట్టడం వల్ల వారు యాక్టీవ్‌గా ఉంటారు. అల్జీమర్స్, పార్కినన్స వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మెదడుపై పు ఒత్తిడిని, వాపును ఎదుర్కోవడంలో హెల్ప్ చేస్తుంది.
ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇతర సమస్యలు త్వరగా ఎటాక్ చేయకుండా అడ్డుకుంటుంది.
ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియకు, జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఆహారంలోని పోషకాలను గ్రహించడాన్ని ప్రోత్సహిస్తుంది. గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి, పెద్ద ప్రేగుల్లో నొప్పి సమస్యలు ఉంటే తగ్గుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..