AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arthritis Pain: ఆర్థరైటిస్ నొప్పి సాకుతో ఈ తప్పులు ఎట్టి పరిస్థితిలో చేయకండి.. సమస్య మరింత పెరుగుతుంది

ఆర్థరైటిస్ సమస్య ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ఉంటుంది. కొందరికి మోకాళ్ల సమస్యలు, మరికొందరికి వెన్నునొప్పి, మరికొందరికి తుంటి నొప్పి.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ఆర్థరైటిస్ నొప్పి చాలా బాధాకరం. ఇది ఎప్పుడు ఎవరికి ఎలా బయటపడుతుందో ఎవరూ చెప్పలేరు. వర్షాకాలంలో తేమ కారణంగా వాత సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో నొప్పి మరింత పెరుగుతుంది. కాళ్లు చేతులు ముడుచుకోవడం కూడా కష్టమయ్యే..

Srilakshmi C
|

Updated on: Sep 09, 2024 | 1:15 PM

Share
ఆర్థరైటిస్ సమస్య ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ఉంటుంది. కొందరికి మోకాళ్ల సమస్యలు, మరికొందరికి వెన్నునొప్పి, మరికొందరికి తుంటి నొప్పి.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ఆర్థరైటిస్ నొప్పి చాలా బాధాకరం. ఇది ఎప్పుడు ఎవరికి ఎలా బయటపడుతుందో ఎవరూ చెప్పలేరు. వర్షాకాలంలో తేమ కారణంగా వాత సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో నొప్పి మరింత పెరుగుతుంది. కాళ్లు చేతులు ముడుచుకోవడం కూడా కష్టమయ్యే స్థాయికి చేరుతుంది. అయితే కొన్ని నియమాలను పాటిస్తే ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

1 / 5
శరీరంలో కీళ్లనొప్పులు ఎక్కువైనప్పుడు, చాలా మంది నడక పూర్తిగా తగ్గిస్తారు. సాధారణ పనులు కూడా చేసుకోలేదు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. ఆర్థరైటిస్‌ను అధిగమించడానికి రెగ్యులర్ వాకింగ్ అవసరం. యోగా చేయాలి. అప్పుడే సమస్య నుంచి బయటపడొచ్చు. బాధాకరమైన గాయాలు తరచుగా కీళ్ల నొప్పికి దారితీస్తాయి. మీరూ కీళ్లనొప్పులతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.

2 / 5
ఎక్కువ నీరు తాగాలి. అలాగే ద్రవ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరం లోపల తేమ సైనోవియల్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ నిర్వహించడానికి సహాయపడుతుంది. సైనోవియల్ ద్రవం ఎండిపోతే, నొప్పి పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం చాలా ముఖ్యం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నట్స్, చేపలు, కూరగాయలు మీ ఆహారంలో క్రమం తప్పకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు చాలా అవసరం.

3 / 5
అధిక బరువు శరీరానికి మంచిది కాదు. అధిక బరువు మోకాలు, ఇతర కీళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఎముక క్షీణతకు దారితీస్తుంది. దీంతో ఆర్థరైటిస్ నొప్పి పెరగవచ్చు.

4 / 5
మీకూ ఆర్థరైటిస్ నొప్పి ఉంటే ప్రథమంగా వైద్యుడిని సంప్రదించాలి. సరైన చికిత్సతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వ్యాయామం చేయడంతో పాటు సరైన సమయంలో క్రమం తప్పకుండా మందులు కూడా తీసుకోవాలి.

5 / 5