ఆదివారం వచ్చిందంటే చాలు అందరి ఇళ్ల నుంచి ఘుమఘుమలాడే సువాసనలు వస్తాయి. కొంత మంది ఇంట్లో చేసుకుంటే.. మరికొంత మంది అలా రెస్టారెంట్లు, హోటల్స్ చుట్టేసి వస్తారు. ఎక్కడైనా నాన్ వెజ్ కామన్. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇలా అన్నింటినీ పట్టు బట్టాల్సిందే. ఎవరికి నచ్చింది వాళ్లు తింటూ ఉంటారు. అందులోనూ నాన్ వెజ్ తినే వాళ్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ తింటారు. ఫ్రెండ్స్ కలిసినా, పార్టీ చేసుకోవాలన్నా, ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా నాన్ వెజ్ అనేది ఇప్పుడు కామన్ అయి పోయింది. మాంసాహారం మరీ ఎక్కువగా తిన్నా అనారోగ్య సమస్యలు తప్పవు. నాన్ వెజ్ లవర్స్ ఎక్కువగా తినే వాటిల్లో చికెన్, మటన్ లివర్ కూడా ఉంటుంది. ఫ్రై లేదా కర్రీ రూపంలో లాగిస్తూ ఉంటారు. మరి చికెన్, మటన్ లివర్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు చూద్దాం.
చికెన్ లివర్‌ని కొంత మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ లివర్ ఫ్రై లేదా కర్రీ చేసుకుని తిన్నా రుచిగానే ఉంటుంది. కానీ చికెన్ లివర్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అంటున్నారు. చికెన్ లివర్ ఎప్పుడో ఒకసారి తినొచ్చు. కానీ రెగ్యులర్‌గా అలవాటు ఉంటే మానుకోమని సచిస్తున్నారు.
చికెన్ లివర్ కంటే మటన్ లివర్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. మటన్ లివర్‌లో ఎక్కువగా ఐరన్ లభిస్తుంది. ఇది రక్త హీనత సమస్యను కంట్రోల్ చేస్తుంది. రక్త హీనత నివారించి, శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చక్కగా జరిగేలా సహాయ పడుతుంది.
మటన్ లివర్ తినడం వల్ల కళ్లకు కూడా మంచిది. ఇందులో ఉండే విటమిన్ ఎ, కళ్లు ఆరోగ్యంగా ఉండేలాల చేస్తుంది. దృష్టి లోపాలను కూడా తొలగిస్తుంది. కంటి సమస్యలు ఉన్నవారు తరచూ మటన్ లివర్ తింటే ఈ మసస్యలు కంట్రోల్ అవుతాయి. కళ్ల సమస్యలు కూడా దరి చేరవని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా చర్మ ఆరోగ్యాన్ిన కూడా పెంచుతుంది.
మటన్ లివర్ తింటే శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటే త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. నరాల ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది. అంతే కాకుండా చికెన్ లివర్‌తో పోల్చితే మటన్ లివర్‌లో విటమిన్ బి12 కూడా పుష్కలంగా లభిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ సమస్యలు, కండరాల సమస్యలు ఉన్నవారు, కిడ్నీల సమస్యలు ఉన్నవారు. బాలింతలు, గర్భవతులు వైద్యుల సలహా మేరకు తినాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.