Banana: ఒకే ఒక్క అరటిపండుతో గుండె సమస్యలకు చెక్.. కానీ.. ఏ టైమ్‌లో తినాలో తెలుసా..?
ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయం 11 గంటలకు అరటిపండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అరటిపండ్లలో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను కంట్రోల్ చేసి..శక్తిని అందిస్తుంది. మరిన్ని లాభాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఈ మధ్యకాలంలో గుండెపోట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే గుండె ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులతో కూడా గణనీయమైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన గుండెకు అనుకూలమైన ఆహారం సమతుల్య రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ రక్త ప్రసరణను పెంచి గుండెను మరింత బలపరుస్తుంది.
రోజులో ముఖ్యంగా ఉదయం 11 గంటలకు అరటిపండు తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయానికి మన శరీరంలో శక్తి తగ్గిపోయినట్లు అనిపించినప్పుడు చాలామంది బిస్కెట్లు, కేకులు లేదా ఇతర చక్కెర పదార్థాలను తింటారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, మళ్లీ త్వరగా తగ్గిపోతాయి. ఈ సమయంలో అరటిపండు తింటే ఈ సమస్య ఉండదని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ అధ్యయనంలో తేలింది.
పొటాషియం: అరటిపండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ కంట్రోల్: అరటిపండ్లలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
స్థిరమైన శక్తి: చక్కెర స్నాక్స్‌లా కాకుండా, అరటిపండులోని ఫైబర్, సహజ చక్కెరలు నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
హృదయానికి అనుకూలమైన ఆహార నియమాలు
పండ్లు, కూరగాయలు: రోజుకు కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి.
తృణధాన్యాలు: తెల్ల బ్రెడ్‌కు బదులుగా గోధుమ బ్రెడ్, వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి తృణధాన్యాలు తీసుకోవడం మంచిది.
చేపలు: వారానికి రెండుసార్లు చేపలు తినడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మంటను తగ్గిస్తాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు: వెన్న, నెయ్యి బదులుగా ఆలివ్ నూనె, సన్ ఫ్లవర్ నూనెను వాడాలి.
ఉప్పు, చక్కెర తగ్గించడం: అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. చక్కెర బరువు పెరగడానికి కారణమవుతుంది.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఈ జీవనశైలి మార్పులు బరువును అదుపులో ఉంచి, శక్తి స్థాయిలను కూడా పెంచుతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




