Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Throat Pain : గొంతునొప్పితో బాధపడుతున్నారా..! అయితే ఈ పండ్లు తినండి..? మంచి ఉపశమనం దొరుకుతుంది..

Throat Pain : సాధరణంగా సీజన్ మారినప్పుడు గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలతో అందరూ

Throat Pain : గొంతునొప్పితో బాధపడుతున్నారా..! అయితే ఈ పండ్లు తినండి..? మంచి ఉపశమనం దొరుకుతుంది..
Throat Pain
Follow us
uppula Raju

| Edited By: Phani CH

Updated on: Jun 07, 2021 | 8:13 AM

Throat Pain : సాధరణంగా సీజన్ మారినప్పుడు గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలతో అందరూ బాధపడుతుంటారు. ఇక ప్రస్తుతం కరోనా సమయంలో ఈ వ్యాధుల ప్రభావం మరీ ఎక్కువైంది. జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా వెంటనే కరోనా వచ్చిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధరణంగా చలికాలంలో ఈ సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే గొంతు నొప్పిని తక్షణమే తగ్గించుకోవడానికి ఈ పండ్లు తింటే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.

1. పైనాపిల్ తినడం వల్ల గొంతు నొప్పి తగ్గి చాలా ఉపశమనం కలుగుతుంది. 2. మల్బరీ యాంటీపైరెటిక్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు వీటిని ఎక్కువ సేపు నమిలితే ప్రయోజనం ఉంటుంది. 3. పాలకూర ఆకులను ఉడకబెట్టి, నీటిని వడపోయండి. ఈ నీటిలో కొద్దిగా అల్లం రసం కలిపి గార్గిల్ చేస్తే గొంతు నొప్పి పూర్తిగా మాయమవుతుంది. 4. గొంతు నొప్పి నయం చేయడానికి వేడి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగితే ఫలితం ఉంటుంది. 5. ఒక గ్లాసు నీటిని తీసుకొని దానిలో 4 నుంచి 5 అంజీరలను వేసి వడపోసి వేడి చేయండి. దీనిని ఉదయం, సాయంత్రం త్రాగండి. ఇలా చేయడం వల్ల మీ గొంతు నొప్పి పోతుంది. 6. తొమ్మిది-పది మిరియాలు తీసుకొని గ్రైండ్ చేసి తరువాత నెయ్యి లేదా చక్కెర సిరప్ తో నాకండి మంచి ఉపశమనం ఉంటుంది.

ఇవి కాకుండా.. మన వంటింట్లో అల్లం, బెల్లం, మాసాలా దినుసులను కలిసి కషాయంగా చేసుకొని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో లవంగాలు, నల్ల మిరియాలు, యాలకులు, అల్లం, బెల్లం వేసి కాసేపు వేడి చేసి తీసుకోవడం వలన గొంతు నొప్పి, దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, టూస్పూన్ అల్లం, నల్ల ఉప్పు, పసుపు, నల్ల మిరియాలు, 5-6 తులసి ఆకులను వేసి కషాయంగా చేసుకోవాలి. దీనిని తాగడం వలన చాతి నొప్పి, జలుబు సమస్యలను నుంచి త్వరగా కోలుకుంటారు.

మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!