పాలల్లో ఈ పొడి కలిపి తాగారంటే కీళ్ల నొప్పులు పరార్.. ఏ టైంలో తీసుకోవాలంటే?
మునగ ఆకుల పొడిలో అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వివిధ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఉపయోగించబడుతుంది. మునగ పొడిని పాలలో కలిపి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు ఆ రోగ్య నిపుణులు. ఇది ఎముకలను బలపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది డయాబెటిస్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది..

మునక్కాయలతో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అదేవిధంగా, వాటి ఆకులను కూడా వివిధ వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు. మునగ ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కానీ మునగ ఆకు పొడిని పలు ఆరోగ్య ఆరోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తారని మీకు తెలుసా? అవును.. ఆయుర్వేదంలో మునగ పొడిలో అనేక ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇందులో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అదనంగా ఇందులో ఫైబర్, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మునగ పొడి కలిపిన పాలు తాగడం వల్ల పలు సమస్యలకు చక్కని ఉపశమనం లభిస్తుంది.
చాలా మంది మునక్కాయలు తినడానికి ఇష్టపడతారు. మరికొందరు దాని ఆకులను ఉపయోగించి వివిధ రకాల వంటకాలను తయారు చేస్తారు. కొంతమంది మునగ ఆకులతో తయారు చేసిన పొడిని తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అవి జీవక్రియను పెంచడం, జీర్ణవ్యవస్థకు మేలు చేయడం వంటి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా మునగ పొడిని పాలల్లో కలిపి తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. పాలు, మునగ పొడి కలిపి తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. ప్రతి సాయంత్రం టీకి బదులుగా పాలలో మునగ పొడి కలిపి తాగడం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే, మునగ పొడిని తినవచ్చు. ఈ పొడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఈ పొడిని రోజూ పాలతో కలిపి తాగవచ్చు. అలాగే మీరు డయాబెటిస్‌తో బాధపడుతుంటే, మునగ పొడిని తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పొడి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ పొడిని ప్రతి ఉదయం లేదా సాయంత్రం పాలతో కలిపి తినాలి. లేదంటే గోరువెచ్చని నీటితో కలిపి కూడా తాగవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడానికి మునగ పొడిని ఆహారంలో జోడించవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలపడుతుంది.
మునగ పొడిని పాలలో కలిపి ఎలా తాగాలంటే.. ?
సాధారణంగా, పాలకూర పొడిని పాలతో కలిపి తాగవచ్చు. లేదంటే నీటితో కలిపి కూడా తాగవచ్చు. దీనికోసం, గ్లాసుడు పాలలో ఒక టీస్పూన్ మునగ పొడి వేసి, బాగా కలిపి త్రాగాలి. ఇలా సాయంత్రం లేదా రాత్రి పూట మునగ పొడి కలిపిన పాలు తీసుకోవచ్చు. ఈ పాలను క్రమంతప్పకుండా తాగడం వల్ల అనేక సమస్యలు నయమవుతాయి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.








