ఒత్తిడి తగ్గాలంటే.. మీరు 15 నిమిషాలు జాగింగ్ చేయాల్సిందే

ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో మనిషి పని ఒత్తిడితో తల్లడిల్లిపోతున్నాడు. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు బిజీ లైఫ్ గడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ బిజీలైఫ్ లో మునిగిపోయి చాలా మంది వారి ఆరోగ్యం విషయం మరిచిపోతున్నారు. చిన్న పనికి చేయడానికి డిప్రెషన్ లోకి వెళ్తున్నాడు. ఈ డిప్రెషన్ వల్ల మనిషి తన ఆయుష్షును కోల్పోతున్నాడు. అంతేగాక ఆకస్మిక మృత్యువాత పడుతున్నాడు. అయితే ఈ ఒత్తిడిని అధిగమిస్తే మనిషి హాయిగా జీవనం సాగించవచ్చు అంటున్నారు మసాచుసెట్స్ […]

ఒత్తిడి తగ్గాలంటే.. మీరు 15 నిమిషాలు జాగింగ్ చేయాల్సిందే
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:44 PM

ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో మనిషి పని ఒత్తిడితో తల్లడిల్లిపోతున్నాడు. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు బిజీ లైఫ్ గడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ బిజీలైఫ్ లో మునిగిపోయి చాలా మంది వారి ఆరోగ్యం విషయం మరిచిపోతున్నారు. చిన్న పనికి చేయడానికి డిప్రెషన్ లోకి వెళ్తున్నాడు. ఈ డిప్రెషన్ వల్ల మనిషి తన ఆయుష్షును కోల్పోతున్నాడు. అంతేగాక ఆకస్మిక మృత్యువాత పడుతున్నాడు. అయితే ఈ ఒత్తిడిని అధిగమిస్తే మనిషి హాయిగా జీవనం సాగించవచ్చు అంటున్నారు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ మానసిక వైద్యులు డాక్టర్ ఆగస్.

కేవలం ప్రతిరోజు పదిహేను నిమిషాలు ఆరుబయట జాగింగ్ చేస్తే మన ఆరోగ్యం మనచేతిలో ఉంటుందని సీబీఎస్ అనే వార్తా సంస్థతో డాక్టర్ ఆగస్ వెల్లడించారు. పలు పరిశోధనలు చేసిన డాక్టర్ ఆగస్ ఈ విషయాన్ని వెళ్లడించారు. ఇంట్లో ఉండి ఒత్తిడి తగ్గించుకునేందుకు వాడే ఔషదాలకు బదులుగా.. ఒక 15నిమిషాలు ఇంట్లో నుంచి బయటికి వస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. మన గుండె యొక్క హృదయ స్పందన వేగాన్ని ఓ పదిహేను నిమిషాలు 50శాతం వేగం పెంచేందుకు ప్రయత్నిస్తే ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు అని డాక్టర్ ఆగస్ వెల్లడించారు.

తన ఆస్పత్రికి వచ్చే తన పేషెంట్ లు డిప్రెషన్ లో ఉన్నానని అంటే వారికి వెంటనే ఔషదాలు ఇవ్వనని తెలిపారు. మొదటగా బయట వెళ్లి కాసేపు సేదాతీరి రమ్మని సలహా ఇస్తానని తెలిపారు. ఇలా చేయడం ద్వారా పేషెంట్ తనకి తెలియకుండానే తన డిప్రెషన్ ను అధిగమిస్తాడని డాక్ట్ ఆగస్ అన్నారు. తన సహచర వైద్యులకు కూడా పేషెంట్ కు వెంటనే మందులు ఇవ్వకూడదని సూచిస్తానని తెలిపారు.

అమెరికాలోని యుక్త వయస్సు (15-44)లో ఉన్న వారు తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నట్లు ఓ సర్వేలో తేలిందని వెల్లడించారు. ప్రతి ఏటా అమెరికన్లలో 6.7 శాతం, యూకేలో 19.7 శాతం ఒత్తిడికి లోనవుతూ పేషెంట్లు గా మారుతున్నట్లు సర్వేలో తేలిందని డాక్టర్ ఆగస్ వెల్లడించారు. 2014 నుంచి మానసిక ఆరోగ్య సంస్థ దాదాపు 6లక్షల మందితో అమెరికా, యూకేలలో సర్వేలు చేపట్టింది. ఈ సర్వే ప్రకారం శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నవారు నిత్యం 15నిమిషాలకు పైగా ఆరుబయట తిరుగుతున్న వారే అని తేల్చింది. రోజు కనీసం పది నిమిషాలు కూడా వ్యాయమం చెయ్యకుండా ఉన్న వారిని పరిశీలిస్తే.. వారంతా తీవ్ర ఒత్తిడితో అనారోగ్యంతో బాదపడుతున్నట్లు తేల్చారు.

ఒత్తిడిని అధిగమించడం ఎలా… మనిషి ఒత్తిడితో ఉండటానికి కారణం దినచర్యలో కార్యచరణ సరిగా లేకపోవడం. దీని ద్వారా ఏ ఒక్కపని సరిగా చేయలే ఒత్తిడికి గురవుతున్నాడు. దీని ద్వారా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరుతున్నాడు. అయితే దీనిని అధిగమించేందుకు డాక్టర్ ఆగస్ పలు సూచనలు చేశారు. రోజు కనీసం పదిహేను నిమిషాలు జాగింగ్ చేయడం ద్వారా ఈ ఒత్తిడిని సులువుగా జయించవచ్చని తెలిపారు. అంతే కాదు మన గుండె యొక్క వేగాన్ని యాభై శాతం పెరిగేలా ఓ పదిహేను నిమిషాలు ఆరుబయట పనిచేస్తే చాలన్నారు. దీని ద్వారా ఒత్తిడిని జయించి ఆస్పత్రికి వెళ్లకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని డాక్టర్ ఆగస్ వెల్లడించారు.