Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: అన్నం తిన్న వెంటనే బ్రష్‌ చేసుకుంటే ఏమవుతుందో తెలుసా.? ఆసక్తికర విషయాలు..

ఉదయం నిద్రలేవగానే అందరూ చేసే పని పళ్లు తోముకోవడం. దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దంతాల ఆరోగ్యాన్ని విస్మరిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా దంతాలు సక్రమంగా శుభ్రం చేసుకోకపోతే కాలక్రమేణ దీర్ఘకాలికంగా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇదిలా ఉంటే బ్రష్‌ చేసుకునే విధానం కూడా దంతాల..

Health Tips: అన్నం తిన్న వెంటనే బ్రష్‌ చేసుకుంటే ఏమవుతుందో తెలుసా.? ఆసక్తికర విషయాలు..
Health Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 01, 2023 | 2:01 PM

ఉదయం నిద్రలేవగానే అందరూ చేసే పని పళ్లు తోముకోవడం. దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దంతాల ఆరోగ్యాన్ని విస్మరిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా దంతాలు సక్రమంగా శుభ్రం చేసుకోకపోతే కాలక్రమేణ దీర్ఘకాలికంగా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇదిలా ఉంటే బ్రష్‌ చేసుకునే విధానం కూడా దంతాల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇంతకీ పళ్లను శుభ్రం చేసుకోవడంలో ఉన్న అపోహలు ఏంటి.? నిజాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* చాలా మంది హార్ఢ్‌ బ్రిజల్స్‌ ఉపయోగిస్తే మెరుగ్గా పనిచేస్తాయనే ఆలోచనలో ఉంటారు. అయితే కఠినమైన బ్రిజల్స్‌ వల్ల దంతాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చిగుళ్ల నుంచి రక్తం రాకవడం వంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి సాఫ్ట్‌ బ్రష్‌ను ఉపయోగించాలి.

* మనలో చాలా మంది రోజులో ఒకేసారి బ్రష్‌ చేసుకుంటారు. బద్దకమో మరే కారణమో కానీ రోజులో రెండుసార్లు బ్రష్‌ చేసుకోవడానికి ఆసక్తి చూపించరు. అయితే కచ్చితంగా రెండుసార్లు బ్రష్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు పళ్లు తోమడం వల్ల దంతాలు పుచ్చిపోకుండా ఉండాలి.

ఇవి కూడా చదవండి

* కొంత మంది తిన్న వెంటనే బ్రష్‌ చేసుకుంటారు. అయితే ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. నోటిలోని లాలాజలం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే, నోటిలోని బ్యాక్టీరియా ఇతర సూక్ష్మక్రిముల నుంచి రక్షిస్తుంది.

* చాలా మంది బ్రష్‌ను మార్చడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. అయితే కచ్చితంగా ప్రతీ 3 నెలలకు ఒకసారి బ్రస్‌ మార్చాలని నిపుణులు చెబుతున్నారు. బ్రిజల్స్‌ వంగిపోయి కనిపించగానే బ్రష్‌ మార్చాలి.

* బ్రష్‌ నిండా పేస్ట్‌ పెట్టుకోవాలని ఏమి ఉండదు. బటాణీ సైజ్‌ అంత పేస్ట్‌ను కాస్త బ్రష్‌లోకి జొప్పించి పెట్టాలి. దీనివల్ల దంతాలకు పేస్ట్‌ పూర్తిగా అప్లై అవుతుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలనే ప్రామాణికంగా తీసుకోవాలి.

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌