AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helmet Vs Hair Loss: హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలుతుందా? దీనిలో నిజమెంత..

భద్రతా కారణాల దృష్ట్యా ద్విచక్ర వాహనదారులు వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నిబంధనలు చెబుతున్నాయి. కానీ కొంతమంది హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందని భావించి దానిని ధరించడానికి వెనుకాడుతుంటారు. కొంతమంది అసలు పూర్తిగా హెల్మెట్ ధరించడమే మానేస్తారు. కానీ హెల్మెట్ నిజంగా..

Helmet Vs Hair Loss: హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలుతుందా? దీనిలో నిజమెంత..
Prevent Hair Loss From Helmets
Srilakshmi C
|

Updated on: Jul 20, 2025 | 8:43 PM

Share

రోడ్డుపై బైక్‌ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. భద్రతా కారణాల దృష్ట్యా ద్విచక్ర వాహనదారులు వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నిబంధనలు చెబుతున్నాయి. కానీ కొంతమంది హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందని భావించి దానిని ధరించడానికి వెనుకాడుతుంటారు. కొంతమంది అసలు పూర్తిగా హెల్మెట్ ధరించడమే మానేస్తారు. కానీ హెల్మెట్ నిజంగా జుట్టు రాలడానికి కారణమవుతుందా? దీని వెనుక అసలు కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందా?

హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందని చాలా మంది భావిస్తారు. చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ అంకుర్ సరిన్ ఏం చెబుతున్నారంటే.. హెల్మెట్లు నేరుగా జుట్టు రాలడానికి కారణం కావు. కానీ మురికిగా లేదా బిగుతుగా ఉండే హెల్మెట్ వల్ల చుండ్రు పెరగడం, జుట్టుపై ఒత్తిడి పెరగడం ద్వారా జుట్టు దెబ్బతింటుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. అలాగే బిగుతుగా ఉండే హెల్మెట్ ధరించడం వల్ల నెత్తిమీద ఎక్కువ చెమట ఉత్పత్తి అవుతుంది. ఇది జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. కాబట్టి, సరైన హెల్మెట్‌ను ఎంచుకుని, తరచూ దానిని శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.

హెల్మెట్ జుట్టుకు ఎలా హాని కలిగిస్తుంది ?

మురికి హెల్మెట్

మురికి హెల్మెట్ చెమట, బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. ఇది నెత్తిమీద చుండ్రు పెరగడానికి దారితీస్తుంది. చుండ్రు నెత్తిమీద చికాకు కలిగిస్తుంది. జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. కాబట్టి హెల్మెట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం, హెల్మెట్ ధరించే ముందు మీ తల చుట్టూ స్కార్ఫ్‌ కట్టుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

టైట్ హెల్మెట్

టైట్ గా ఉన్న హెల్మెట్ ధరించడం వల్ల తలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. జుట్టు రాలడానికి దారితీస్తుంది. సరైన పరిమాణంలో సౌకర్యవంతంగా ఉండే హెల్మెట్‌ను ఎల్లప్పుడూ ధరించడం ముఖ్యం.

హెల్మెట్ నుంచి జుట్టును సంరక్షించుకోవాలంటే తీసుకోవల్సిన జాగ్రత్తలు

  • హెల్మెట్ల వల్ల జుట్టు రాలడం సమస్యను నివారించడానికి జుట్టు, నెత్తిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జుట్టులో చెమట, ధూళి పేరుకుపోకుండా ఉండటానికి తరచూ తల స్నానం చేస్తుండాలి. దీనితో పాటు జుట్టుకు నూనె రాయడం మర్చిపోకూడదు. ప్రతి వారం రెండు నుంచి మూడు సార్లు స్నానం చేసే ముందు తలకు నూనె రాయడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. ఇది హెల్మెట్ ప్రభావాల నుంచి జుట్టును రక్షించడంలో సహాయపడుతుంది.
  • తడి జుట్టు ఉన్నవారికి హెల్మెట్ ధరించకూడదు. నిజానికి తడి జుట్టు ఉన్నవారికి హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు తెగిపోవడం, తలపై చుండ్రు రావడం వంటి సమస్యలు వస్తాయి.
  • సరైన సైజు హెల్మెట్ ధరించడం కూడా ముఖ్యం. మీరు ఎల్లప్పుడూ తలకు సౌకర్యవంతంగా సరిపోయే హెల్మెట్‌ను ధరించాలి. హెల్మెట్ లోపల పేరుకుపోయే చెమట, ధూళి, బ్యాక్టీరియా జుట్టును దెబ్బతీస్తాయి. కాబట్టి హెల్మెట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. జుట్టు రాలడానికి ఇదే ప్రధాన కారణం.
  • మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరుల హెల్మెట్లను ధరించకూడదు. ఎందుకంటే ఇది తలపై ఇన్ఫెక్షన్లు, చుండ్రు, జుట్టు రాలడం వంటి ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.