Lifestyle: తరచూ నోరు పొడిబారుతోందా.? అలర్ట్‌ అవ్వాల్సిందే..

సాధారణంగా నోరు నిత్యం తడిగా ఉండడానికి నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. అయితే వయుసు పెరిగే కొద్దీ.. ఈ సమస్య తరచుగా కనిపిస్తుంది. కొన్ని మందులు లేదా క్యాన్సర్ రేడియేషన్ థెరపీ యొక్క దుష్ప్రభావాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. నోరు పొడిబారడం గొంతులో నొప్పి ఉంటుంది. నోటిలో నుంచి చెడు వాసన వస్తుంది. నమలడం, మింగడం కష్టంగా ఉంటుంది...

Lifestyle: తరచూ నోరు పొడిబారుతోందా.? అలర్ట్‌ అవ్వాల్సిందే..
Dry Mouth
Follow us

|

Updated on: May 07, 2024 | 5:10 PM

నోరు పొడి బారడం సర్వ సాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమయంలో ఈ అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటాం. అయితే ఎండకాలంలో నోరు పొడిబారడం అనేది సాధారణమే. అయితే నీరు తాగిన తర్వాత కూడా నోరు పొడిబారుతుంటే, వాతావరణం చల్లగా ఉన్న సమయంలో కూడా నోరు పొడిబారుతుంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. తరచూ నోరు పొడిబారడం ఎన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుండొచ్చని చెబుతున్నారు.

సాధారణంగా నోరు నిత్యం తడిగా ఉండడానికి నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. అయితే వయుసు పెరిగే కొద్దీ.. ఈ సమస్య తరచుగా కనిపిస్తుంది. కొన్ని మందులు లేదా క్యాన్సర్ రేడియేషన్ థెరపీ యొక్క దుష్ప్రభావాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. నోరు పొడిబారడం గొంతులో నొప్పి ఉంటుంది. నోటిలో నుంచి చెడు వాసన వస్తుంది. నమలడం, మింగడం కష్టంగా ఉంటుంది. దీంతో పాటు పేదాలు కూడా అతుక్కుపోతుంటాయి.

ఒక నోరు పొడి బారడానికి కూడా నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. వీటిఇలో ప్రధానమైంది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడడం, ఎక్కువ రోజుల నుంచి మందులు వాడే వారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అలాగే పోషకాహార లోపం, తగినంత నీరు తాగకపోవడం కూడా నోరు పొడి బారడానికి కారణంగా చెబుతున్నారు. ఇక డయాబెటిక్ పేషెంట్లకు కూడా నోరు పొడిబారడం సాధారణ సమస్య. దీర్ఘ కాలంగా ఈ సమస్య ఎదురైతే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఇక కొన్ని సందర్భాల్లో నోరు పొడి బారడం అల్జీమర్స్‌కు కూడా లక్షణంగా చెబుతున్నారు. పొడి నోరు సమస్య స్ట్రోక్, ఓరల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లో కూడా సంభవిస్తుందని అంటున్నారు.

కాగా ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకునే వారిలోనూ నోరు పొడిబారుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రాత్రుళ్లు నోరు తెరిచి పడుకునే వారికి కూడా ఈ సమస్య వస్తుందని అంటున్నారు. చాలా కాలంగా ఈ సమస్యతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..