
జుట్టు ఒత్తుగా పెరగాలని, అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ముఖ్యంగా లేడీస్‌కి అయితే పొడవైన జుట్టు ఉండాలనే ఓ కల ఉంటుంది. కానీ ఇప్పుడు అందరికీ కొత్తి మీర కట్టలే. ప్రతి రోజూ జుట్టును చూసుకుంటూ.. హెయిర్ పెరగాలని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతం మారిన జీవన శైలిలో ఉన్న జుట్టును కాపాడుకునేందుకే తాపత్రయ పడాల్సి వస్తుంది. ఇందుకోసం చాలా మంది లక్షలకు లక్షలు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. కొంత మందికి అయితే చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ఇలా పెద్దగా ఖర్చు లేకుండా.. మీరు తినే ఆహారంతోనే జుట్టును ఆరోగ్యంగా.. అందంగా ఉంచుకోవచ్చు. ప్రతి రోజూ పోషకాలు నిండిన ఆహారం తీసుకుంటే.. చర్మం, జుట్టు, శరీర భాగాలు అన్నీ హెల్దీగా ఉంటాయి. మరి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే జుట్టుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్స్ శరీరానికి అవసరమైన పోషకాల్లో ప్రోటీన్ కూడా ఒకటి. ప్రోటీన్స్ లోపం కారణంగా కూడా జుట్టు రాలుతుంది. ప్రతి రోజు ప్రోటీన్స్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాలడం అనేది తగ్గుతుంది. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గల ఆహారం తీసుకోవడం వల్ల కూడా జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. ముఖ్యంగా సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపల్లో ఈ ఫ్యాటీ యాసిడ్స్ లభ్యమవుతాయి. కాబట్టి తరుచుగా చేపలు తినడం మంచిదె. చర్మం కూడా హెల్దీగా ఉంటుంది.
గ్రీక్ పెరుగను ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో విటమిన్ బి5 ఉంటుంది. ఇది జుట్టును బలంగా చేయడమే కాకుండా స్కాల్ఫ్‌పై రక్త సరఫరాను పెంచుతుంది. దీంతో జుట్టు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
జామ పండ్లు తినడం వల్ల కూడా జుట్టు సమస్యల నుంచి బయట పడొచ్చు. జామ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా విరగకుండా కాపాడుతుంది. అంతే కాకుండా చర్మం కూడా ఫ్రెష్ గా, మెరుస్తూ ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.