Monsoon Diet: వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో సమస్యలన్నీ దూరం

సమస్యల నుంచి బయటపడడానికి కచ్చితంగా మనకు రోగ నిరోధక శక్తి చాలా బాగా ఉండాలి. కాలానుగుణ వ్యాధులు నుంచి రక్షించుకోవడానికి మన రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడం చాలా అవసరం. కాబట్టి మన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి బలమైన ఆహారం తీసుకోవడం చాలా అత్యవసరం.

Monsoon Diet: వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో సమస్యలన్నీ దూరం
Diet

Edited By:

Updated on: Jul 16, 2023 | 8:59 PM

వర్షాకాలం అంటేనే మనలోని అనారోగ్యాలన్నీ బయటపడే కాలమని అందరూ అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో మనకు జలుబు, దగ్గు, జ్వరం, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి అనేక సమస్యలు వేధించే అవకాశం ఉంది. ఈ సమస్యల నుంచి బయటపడడానికి కచ్చితంగా మనకు రోగ నిరోధక శక్తి చాలా బాగా ఉండాలి. కాలానుగుణ వ్యాధులు నుంచి రక్షించుకోవడానికి మన రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడం చాలా అవసరం. కాబట్టి మన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి బలమైన ఆహారం తీసుకోవడం చాలా అత్యవసరం. కాబట్టి వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడానికి తినాల్సిన ఆహారం గురించి ఓ సారి తెలుసుకుందాం.

పులుపు పండ్లు

నారింజ, నిమ్మకాయలు, కమలా, బత్తాయి వంటి పండ్లను ఈ కాలంలో తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండ్లల్లో విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడంలో విటమిన్‌-సి కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ కాలంలో వీటిని తినడం చాలా ముఖ్యం.

పెరుగు

పెరుగు అంటే ప్రో బయోటెక్‌ ఎక్కువగా ఉండే ఆహారం. పెరుగు పేగులకు మేలు చేస్తుంది. ముఖ్యంగా పెరుగులో జింక్‌, మెగ్నీషియం, షెలినియం, విటమిన్‌ డి వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు జలుబు, ఫ్లూ వంటి కాలానుగుణ వ్యాధులతో పోరాడడానికి సాయం చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

ఆకు కూరలు

ఆకు కూరలైన బచ్చలి కూర, తోట కూర, గోంగూర, క్యాబేజీ వంటి గ్రీన్‌ లీఫీ వెజిటేబుల్స్‌ కూడా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. శరీర పనితీరును మెరుగుపర్చే విటమిన్లు ఆకు కూరల్లో అధికంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వర్షాకాలంలో జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

గింజలు

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో గింజలు మంచి చేస్తాయి. గింజల్లో అవసరమైన ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపర్చడం వల్ల రోగాలకు దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండడానికి క్రమంగా గింజలను తీసుకోవడాన్ని పెంచాలి. బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌ వంటి వాటిల్లో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడంలో సాయం చేస్తాయి. 

గ్రీన్‌ టీ

గ్రీన్‌ టీలో ఎపిగాల్లో కాటెచిన్‌ అంటే యాంటీ ఆక్సిడెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. కాటెచిన్‌ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గడంలో సహాయపడతాయి. యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్‌ టీ రోగ నిరోధక వ్యవస్థను బలపర్చడంలో సాయం చేస్తుంది. 

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..