Green Tea: గ్రీన్ టీ ఏ టైమ్‌లో తాగుతున్నారు.? సరైన సమయం ఏంటో తెలుసుకోండి
ఇటీవల చాలా మంది గ్రీన్‌టీ ని తీసుకుంటున్నారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెరుగుండడం. కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో గ్రీన్ టీని అలవాటు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. రెగ్యులర్ టీ స్థానంలో గ్రీన్ టీని తీసుకుంటున్నారు. గ్రీన్ టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే...
ఇటీవల చాలా మంది గ్రీన్‌టీ ని తీసుకుంటున్నారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెరుగుండడం. కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో గ్రీన్ టీని అలవాటు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. రెగ్యులర్ టీ స్థానంలో గ్రీన్ టీని తీసుకుంటున్నారు. గ్రీన్ టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే గ్రీన్ టీని తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రీన్ టీ తాగే సమయం విషయంలో కొన్ని తప్పులు చేయకూడదని అంటున్నారు. ఇంతకీ గ్రీన్ టీని ఏ సమయంలో తాగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఉదయం లేవగానే పరగడుపున గ్రీన్ టీని తాగుతున్నారు. అయితే ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఖాళీగా ఉన్న సమయంలో గ్రీన్ టీ తీసుకోవడంవల్ల కడుపులో నొప్పికి కారణమయ్యే అవకాశం ఉంటుందని డైటీషియన్లు చెబుతున్నారు. గ్రీన్‌టీలో ఉండే పాలీఫెనాల్స్ టానిన్లు కడుపులో ఆమ్లాన్ని పెంచుతాయి. ఇది కడుపు నొప్పిని, వాపు, మలబద్ధకం వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ఖాళీ కడుపుతో గ్రీన్‌టీని తీసుకోకూడదు.
ఇక చాలా మంది టిఫిన్ చేయగానే లేదా భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతుంటారు. ఇది కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల వాంతులు, గ్యాస్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీని తీసుకోవడం మంచి అలవాటు కాదు. రాత్రి పడుకునే ముందు కూడా గ్రీన్ టీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇంతకీ గ్రీన్ టీని ఎప్పుడు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం టిఫిన్ చేసిన కాసేపటి గ్రీన్ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే సాయంత్రం గ్రీన్ టీ తాగితే జీవక్రియ వేగవంతం అవుతుంది. బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఇక మంచిది కదా అని ఎక్కువగా తాగితే ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్‌టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట కొవ్ తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి కూడా గ్రీన్ టీ ఉయోగపడుతుంది. ఇందులోని మంచి గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇక గ్రీన్ టీలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
నోట్: పైన తెలిపిన విసయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..